NTV Telugu Site icon

Rakesh Master Last Video: చనిపోయే ముందు రాకేశ్ మాస్టర్ రికార్డు చేసిన సెల్ఫి వీడియో!

Rakesh Master Last Selfie V

Rakesh Master Last Selfie V

Rakesh Master last Video viral in social media: ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ హఠాన్మరణం చెందారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన హఠాన్మరణం అభిమానులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. అయితే ఆయన ఎలా చనిపోయారు అనే దానికి ముందు ఆయనకు వడ దెబ్బ తగలడం వల్ల అనే వాదన తెర మీదకు వచ్చింది. అయితే ఆ తర్వాత ఆయన ఏపీ మందు, బీర్లు తాగడం వల్లే అనే మరో వాదన కూడా తెర మీదకు వచ్చింది. ఆ తర్వాత కొందరు రాకేష్ మాస్టర్ యాసిడ్ తాగినట్టు డాక్టర్లు అనుమానించారని ఆయన ఫోన్ కూడా మిస్ అయిందని వార్తలు వచ్చాయి.

Jr NTR fan last video: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ చివరి వీడియో..

అయితే ఇన్ని రకాల ప్రచారాల నేపథ్యంలో రాకేష్ మాస్టర్ ఆసుపత్రిలో చేరే ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. ఈ వీడియోలో, రాకేష్ మాస్టర్ తన భయాన్ని వ్యక్తం చేశారు, ఇటీవల రోజుల్లో కేవలం నీటిని మాత్రమే తీసుకున్నానని , డీహైడ్రేషన్ కారణంగా బలహీనంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. రాకేష్ మాస్టర్ ఈ వీడియోలో వైజాగ్ సత్య సహా ఉప్పల్ బాలు, తాను సహజీవనం చేసిన లక్ష్మీ వంటి వారి పేర్లు గురించి కూడా ప్రస్తావిస్తూ, తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఎవరినైనా సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇక ఈ వీడియో మీరు కూడా చూసేయండి మరి.

Show comments