Raju Weds Rambai : గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న మూవీ రాజు వెడ్స్ రాంబాయి. సాయిలు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించారు. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్‌సూన్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. తాజాగా మూవీ ట్రైలర్ ను అడవిశేష్ రిలీజ్ చేశాడు. తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీతో మూవీ తీశారు. ఒకే ఊరిలో ఉండే రాజు, రాంబాయి లవ్ చేసుకుంటారు. కానీ రాంబాయి తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. అటు ప్రియుడు, ఇటు తండ్రి మధ్య నలిగే అమ్మాయి ప్రేమ కథగా తెలుస్తోంది.
Read Also : Rashmika : అందుకే ఇంటర్వ్యూలకు రాను.. ట్రోల్స్ పై రష్మిక రియాక్ట్
ఈ ట్రైలర్ లో తెలంగాణ యాసలో డైలాగులు, పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఆకట్టుకుంటున్నాయి. రాంబాయి ప్రేమ కోసం రాజు ఏం చేశాడు.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోవాలంటే ప్రెగ్నెంట్ అయితే ఆటోమేటిక్ గా ఒప్పేసుకుంటారని ఇద్దరూ తరచూ కలవడం లాంటివి ట్రైలర్ లో చూపించారు. కానీ చివరకు రాంబాయి తండ్రి ఒప్పుకోకపోవడం.. రాజు పెళ్లి చేసుకోకపోతే తట్టుకోలేకపోవడం ఇందులు చివరలో చూపించారు. ‘చేసుకోనంటే నవ్వు కొడుతవ్.. చేసుకుంటా అంటే ఆయన కొడుతడు.. మీ ఇద్దరి మధ్యల నేను సత్తాన్న’ అని హీరోయిన్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ నెల 21న మూవీ రిలీజ్ కాబోతోంది.
Read Also : Vijay Devarakonda : వీలైనంత ఎంజాయ్ చేయండి.. విజయ్ కామెంట్స్ కు అర్థమేంటో
