NTV Telugu Site icon

Rajkumar Hirani: ఒక్క ప్లాప్ కూడా లేని డైరెక్టర్.. బాలీవుడ్ కు దొరికిన డైమండ్

Hirani

Hirani

Rajkumar Hirani: బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే అందమైన సినిమాలను తెరకెక్కించే అరుదైన దర్శకుల్లో రాజ్‌కుమార్ హిరాణీ ఒకరు. ఈరోజు ఆయన తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన కేవలం హిట్ చిత్రాలను మాత్రమే రూపొందించలేదు. ప్రేక్షకుల హృదయాలపై శాశ్వతమైన ప్రభావాన్ని చూపిన సినిమాలను డైరెక్ట్ చేశారు. సంజు, పీకే, త్రీ ఇడియట్స్ మున్నాభాయ్ లగే రహో, మున్నాభాయ్ జిందాబాద్ సినిమాలను హిరాణి మనకు అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఒక్కో సినిమాను ఒక్కో వజ్రంగా ఆయన ఆవిష్కరించారు. ఇప్పుడు డంకీ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్‌, రాజ్ కుమార్ హిరాణీ కాంబినేషన్‌లో తొలిసారి రాబోతున్న సినిమా ఇది. హాయిగా నవ్వుకునే సినిమానే కాదు, మనసుకు హత్తుకునే భావోద్వేగాల కలయికగా డంకీ సినిమా ప్రేక్షకులను మెప్పించనుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Nani: అరే.. ఇదేం ప్రమోషన్స్ కాకా.. కేసీఆర్ నే ఇమిటేట్ చేస్తావ్ లే..

కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన సినిమాలనే కాకుండా మంచి కథ, భావోద్వేగాలతో పాటు చక్కటి సామాజిక సందేశం ఉన్న సినిమాలను రూపొందించటం రాజ్ కుమార్ హిరాణీ స్పెషాలిటీ. ఆయన మూవీ నెరేషన్‌లో మన సంస్కృతిని చక్కగా చూపించటంతో పాటు సంభాషణలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. సమాజంపై శాశ్వతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఆయన సినిమా మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణను రాబట్టుకుంటున్నాయి.

Devara : దేవర షూటింగ్ లో హీరో శ్రీకాంత్ కు గాయం.. అస్సలు ఏమైందంటే..?

డంకీ సినిమాను వీక్షించేటప్పుడు మధురమైన అనుభూతులతో పాటు సినిమాలోని చక్కటి మాధుర్యం చూపించి ప్రేక్షకులకు సినిమాపై ఉన్న వ్యామోహాన్ని మరింత పెంచుతుంది. రీసెంట్‌గా రిలీజైన డంకీ డ్రాప్ 1 తో సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. ఇది ప్రేమ, స్నేహం అనే అంశాలపై నలుగురి స్నేహితుల మధ్య నడిచే కథాంశం. తమ జీవితానికి సంబంధించిన కలలను సాకారం చేసుకోవటానికి వారు చేసిన ప్రయాణాన్ని చూపించే ఈ సినిమా కొన్ని నిజ ఘటనల ఆధారంగా రూపొందుతుంది.

Captain Miller: జింకను వేటాడే పులి కళ్లు ఎలా ఉంటాయో.. అలా ఉన్నాయి సామీ

షారూక్ ఖాన్‌తో పాటు బోమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన డంకీ సినిమాలో కామెడీ, ఎమోషన్స్, చక్కటి సందేశం కలయికగా డంకీ సినిమా ఆకట్టుకుంటుందనే హామీని డంకీ డ్రాప్ ప్రేక్షకులకు ఇచ్చింది. ఈ చిత్రం ఈ డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌వుతుంది.

Show comments