Site icon NTV Telugu

Rajinikanth: అతను నీలాంబరి ముందు నరసింహా పరువు తీశాడు..

Rajini

Rajini

Rajinikanth: నా పేరు నరసింహా .. ఇంటిపేరు రణసింహా.. అంటూ రజినీ తనదైన స్టైల్లో పాడుతుంటే.. కోరస్ పాడని అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ నిలిచింది నరసింహా సినిమా. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ నటించి మెప్పించింది. నరసింహా- నీలాంబరి జంట గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటారు. నరసింహా ప్రేమకోసం నీలాంబరి తన జీవితాన్నే పోగొట్టుకుంటుంది. ప్రేమను పగగా మార్చుకొని అతడి అంటూ చూడాలనుకొని.. చివరికి ఆమె అంతం అయిపోతుంది. ఇప్పటికీ నీలాంబరి ప్రేమ గురించి, ఆమె పొగరు గురించి ఎక్కడో ఒకచోట మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇక దాదాపు 25 ఏళ్ళ తరువాత నరసింహా- నీలాంబరి ఒక్కటి అయ్యారు. కాదు కాదు తమిళ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఒక్కటి చేశాడు. అవును ఆయన దర్శకత్వం వహించిన జైలర్ సినిమాలో వీరు జంటగా కనిపించబోతున్నారు. రజినీకాంత్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది.

Payal Rajputh: పెళ్లి కానీ మగాళ్లే కాదు.. పెళ్ళైన మగాళ్లు కూడా దానికోసమే వెతుకుతున్నారు

ఆగస్టు 10 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ .. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో రజినీకాంత్ సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.అంతే కాకుండా రమ్యకృష్ణతో మళ్లీ నటించడంపై కూడా చెప్తూ కామెడీ చేశారు. సెట్ లో నెల్సన్ తమను ఎంత ఇబ్బంది పెట్టాడో సరదాగా చెప్పుకొచ్చారు. ” 25 ఏళ్ళ తరువాత రమ్యకృష్ణతో కలిసి నటిస్తున్నా.. ఒక సీన్ కోసం నెల్సన్ 8 టేకులు తీసుకున్నాడు. ప్రతిసారి అది తక్కువ అయ్యింది.. ఇది ఎక్కువ అయ్యింది అంటూ చెప్పుకొస్తూనే ఉన్నాడు. నీలాంబరి ముందు నరసింహా పరువు తీశాడు ఈ నెల్సన్ ” అంటూ చమత్కరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

Exit mobile version