NTV Telugu Site icon

Rajinikanth: జైలర్ హిట్ అవుతుందని నేను అనుకోలేదు.. రజినీ సంచలన వ్యాఖ్యలు

Rajini

Rajini

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు మూడేళ్ళ తరువాత జైలర్ సినిమాతో హిట్ అందుకున్నాడు. బీస్ట్ సినిమాతో పరాజయాన్ని అందుకున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. ఈసారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న కసితో జైలర్ సినిమాను తెరకెక్కించాడు. ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది. కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. రజినీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా జైలర్ గుర్తింపు తెచ్చుకుంది. కేవలం ముందే మూడురోజుల్లో రూ. 200 కోట్లు రాబట్టి రజినీ ర్యాంపేజ్ ను చూపించింది. ఇక ఈ చిత్రం రజినీ ఎలివేషన్స్.. మోహన్ లాల్, శివన్న లా క్యామియో.. అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. బీస్ట్ సినిమా పరాజయం తరువాత నెల్సన్ తో సినిమా వద్దని రజినీకి చాలామంది చెప్పినా ఆయన కథను నమ్మి ఈ సినిమాలో నటించినట్లు చెప్పుకొచ్చారు.

Sridevi: ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ఇన్ ఇండియా .. తొమ్మిదిమంది సూపర్ స్టార్స్ తో

ఇక సినిమా రిలీజ్ కు ముందు రోజే రజినీ హిమాలయాలకు వెళ్లిన విషయం తెల్సిందే. ఇక తాజాగా రజినీ బద్రీనాథ్‌ ఆలయాన్ని సందర్శించి అనంతరం రిషికేష్‌లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమంలో ప్రత్యేక్షమయ్యాడు. మొట్ట మొదటిసారి రజినీ, జైలర్ రిజల్ట్ పై స్పందించాడు. ” సినిమా షూటింగ్ సమయంలో చాలా ఒత్తిడి ఉండేది. ఆ ఒత్తిడికి నేను కూడా లోనయ్యాను. ఒకనొక సందర్భంలో ఈ సినిమా హిట్ అవుతుందా అనే అనుమానం కూడా వచ్చింది. అప్పుడు స్వామిజీ ఒక మాట చెప్పారు.. కంగారు పడకు.. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నారు. ఆయనే స్వయంగా చెప్పిన తరువాత ఇక జైలర్ రిజల్ట్ గురించి ఆలోచించడం ఎందుకు అనుకున్నా.. ఇక జైలర్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి విజయాన్ని అందుకుంది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments