NTV Telugu Site icon

Rajinikanth: నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే..

Rajini

Rajini

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాడో అందరికి తెల్సిందే. ఈ స్థాయికి రావడానికి ఆయన పడిన కష్టం అంతాఇంతా కాదు. ఒక బస్సు కండక్టర్ నుంచి సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శప్రాయం. అయితే మనిషి అన్నాకా తప్పులు చేయకుండా ఉండడు. అది ఎంతటి దిగ్గజుడు అయినా కూడా. సూపర్ స్టార్ రజినీ కూడా తన జీవితంలో ఒక తప్పు చేశారట .. అదే తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని అందరి ముందు ఒప్పుకోవడం విశేషం. నిన్న జరిగిన జైలర్ ఆడియో లాంచ్ లో రజినీ తాను చేసిన తప్పును బయటపెట్టారు. ఇంతకు రజినీ చేసిన తప్పు ఏంటంటే.. మద్యపానానికి బానిసగా మారడం, ఒకానొక సమయంలో ఆయన మందుకు అడిక్ట్ అయ్యినట్లు చెప్పుకొచ్చారు. దానివలన తాను చాలా కోల్పోయాను అని తెలిపారు.

Chandramukhi 2: రాజాధిరాజా..రాజ గంభీర.. వెంకటపతిరాజశేఖర.. వేంచేస్తున్నారు.. పరాక్

“నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు మద్యానికి బానిసగా మారడం. అది లేకుండా ఉంటే .. సమాజానికి ఎంతో కొంత మేలు చేసేవాడిని. మద్యం సేవించకపోతే నేను జీవితంలో చాలా మెరుగ్గా రాణించి ఈ రోజు కంటే ముందే పెద్ద స్టార్‌గా ఎదిగి ఉండేవాడిని. మీరు కూడా మద్యం జోలికి వెళ్లకుండా బాధ్యతగా ఉండండి. అనుకున్నది సాధిస్తారు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఒకానొక సమయంలో రజినీ మద్యపానంలో మునిగితేలేవారట. ఆ తరువాత దాన్ని నుంచి బయటపడి ఆధ్యాత్మిక చింతనలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న రజినీ ఈ సినిమాలతో హిట్స్ ను అందుకుంటాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Show comments