Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth: సినిమా బాగుందని ప్రేక్షకులు చెప్పడం ఒక ఎత్తయితే.. అదే మాటను సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా చెప్పడం మరో ఎత్తు. ప్రస్తుతం హీరో సూరికి అలాంటి అరుదైన ప్రశంసే దక్కింది. సూరి నటించిన ‘మండాడి’ సినిమాను చూసిన రజనీకాంత్.. నేరుగా సూరికి ఫోన్ చేసి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ ఊహించని ఫోన్ కాల్‌తో సూరి ఎంతగా ఎమోషనల్ అయ్యారో ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ చూస్తే అర్థమవుతోంది.
సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చిన ‘మండాడి’కి ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సూరి నటనతో పాటు సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సినిమాను చూసి సూరిని అభినందించడం విశేషం. సినిమా చూసిన తర్వాత రజనీకాంత్ స్వయంగా ఫోన్ చేసి సూరితో మాట్లాడిన విషయాన్ని ఆయనే సోషల్ మీడియాలో వెల్లడించారు.
Also Read
- Ramya Krishnan Birthday: 'కమలా రెడ్డి'గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
- Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
- Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
- Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
రజనీకాంత్ నుంచి వచ్చిన ఆ ఫోన్ కాల్ తనకు, తన టీమ్ మొత్తానికి ఎంతో ప్రత్యేకమని సూరి తెలిపారు. సూపర్ స్టార్ ‘మండాడి’ని చూసి ఇష్టపడ్డారని, మనస్ఫూర్తిగా ఫోన్ చేసి అభినందించారని చెప్పారు. ఫోన్ అవతలి వైపు నుంచి రజనీకాంత్ గొంతు వినడం తనకు ఒక అమూల్యమైన క్షణమని సూరి పేర్కొన్నారు. అంతేకాదు ఆయన చెప్పిన మాటలను తనకు దక్కిన గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు తెలిపారు.
‘మండాడి’ విషయానికి వస్తే.. తమిళనాడు తీర ప్రాంతంలో జరిగే సంప్రదాయ పడవ పందెం చుట్టూ ఈ కథ సాగుతుంది. మతిమారన్ పుగళేంధి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూరి ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ సినిమా షూటింగ్ కూడా అంత ఈజీగా సాగలేదు. దాదాపు రెండు నెలల పాటు సముద్రంలోనే కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. పడవలపై, సముద్రంలో షూటింగ్ చేయాల్సి రావడంతో యూనిట్‌కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వాటన్నిటిని ఎదుర్కొని థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు వస్తున్న ప్రశంసలు చిత్రబృందానికి ప్రత్యేక ఆనందాన్ని ఇస్తున్నాయి.
కామెడీ నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన సూరి ఇప్పుడు వరుసగా హీరో క్యారెక్టర్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘విడుదలై పార్ట్ 1’ ఆయన కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత ‘గరుడన్’, ‘మామన్’ వంటి సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మండాడి’ కూడా ఆ ప్రయాణంలో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తోంది. ఇందులో సూరితో పాటు సుహాస్ కూడా మంచి మార్కులు కొట్టేశాడు. ప్రతి నాయకుడి పాత్రలో సుహాస్ నటనకి కూడా ప్రశంసలు వస్తున్నాయి.
ఇప్పటికే నటుడిగా తన కొత్త ఇమేజ్ను బలపరుచుకుంటున్న సూరికి ‘మండాడి’ మంచి గుర్తింపును తీసుకొస్తోంది. దానికి తోడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన ఆ మాటలు తనకు ఆశీర్వాదంలాంటివని సూరి చెప్పడం చూస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్ ఆయనకు ఎంతటి భావోద్వేగాన్ని ఇచ్చిందో అర్థమవుతోంది.
- Tags
- cinema
- Rajinikanth
తాజావార్తలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!