Site icon NTV Telugu

Lal Salam : ఎట్టకేలకు ఓటీటీలోకి రజినీకాంత్ ‘లాల్ సలాం’..

Lal Salaam

Lal Salaam

Lal Salam : సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లాల్ సలాం’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ రిలీజ్ అయిన దాదాపు 16నెలల తర్వాత ఓటీటీలోకి రావడానికి రూట్ క్లియర్ అయింది. ఈ రోజుల్లో ఏ సినిమా అయినా సరే రిలీజ్ అయిన నెల వరకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ గతేడాది మొదట్లో రిలీజ్ అయింది. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో ‘లాల్ సలాం’ మూవీ వచ్చింది. ఇందులో రజినీకాంత్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను రజినీ కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేసింది.

Read Also : Nara Lokesh: లోకేష్‌ ప్రమోషన్‌ని కావాలనే పెండింగ్‌లో పెట్టారా..?

ఈ సినిమాలో మొయినుద్దీన్ అనే పాత్రలో రజినీకాంత్ నటించారు. అయితే రిలీజ్ అయిన తర్వాత మూవీపై కొన్ని రకాల ప్రచారాలు జరగడంతో ఓటీటీలోకి రాలేకపోయింది. తన కూతురు కోసమే రజినీకాంత్ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు. కానీ ఈ సినిమా రజినీ స్థాయి కాదంటూ ఆయన ఫ్యాన్స్ విమర్శలు గుప్పించారు. ఏదేమైనా.. ఎట్టకేలకు మూవీని సన్ నెక్ట్స్ వేదికగా జూన్ 6 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

Read Also : The Rajasaab : ‘రాజాసాబ్’ టీజర్ రిలీజ్ అయ్యేది అప్పుడే..?

Exit mobile version