సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ తర్వాత ఆడియన్స్ ముందుకి ‘లాల్ సలామ్’ సినిమాతో వచ్చాడు. ఆగస్ట్ 9న జైలర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన రజినీకాంత్… ఫిబ్రవరి 9న లాల్ సలామ్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు. ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేసిన లాల్ సలామ్ సినిమాలో రజినీకాంత్ మొయిద్దీన్ భాయ్ గా క్యామియో ప్లే చేసాడు. ఎక్స్టెండెడ్ క్యామియో ప్లే చేసిన రజినీకాంత్ ఫేస్ ఆఫ్ లాల్ సలామ్ సినిమా అయ్యాడు. ప్రమోషన్స్ లో రజినీకాంత్ పేరుని చిత్ర యూనిట్ బాగానే వాడారు. విష్ణు విశాల్, విక్రాంత్ మెయిన్ హీరోలుగా నటించినా కూడా రజినీకాంత్ పేరుతో లాల్ సలామ్ సినిమా ప్రమోట్ అయ్యింది. రజినీకాంత్ ఉన్నాడు కాబట్టే తెలుగులో కూడా ఈ సినిమాకి బజ్ జనరేట్ అయ్యింది. రెహ్మాన్ మ్యూజిక్ కూడా లాల్ సలామ్ సినిమాకి హైప్ తెచ్చింది.
క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన లాల్ సలామ్ సినిమాకి కోలీవుడ్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. తెలుగులో ఇంకా టాక్ బయటకి రాలేదు. రజినీకాంత్ ఎమోషనల్ సీన్ లో ఏడిపించేసాడు అనే మాట తమిళ ఆడియన్స్ లో వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ లో 20 నిముషాలు మాత్రమే కనిపించిన రజినీకాంత్… సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా నటించాడట. అన్ని సెంటర్స్ నుంచి హిట్ టాక్ పడితే రజినీకాంత్ క్యామియోతో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసినట్లే. తెలుగులో మనో డబ్బింగ్ మిస్ అవ్వడం కారణంగా ఎక్కువ మంది లాల్ సలామ్ సినిమా చూసే సమయంలో రజినీకాంత్ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వడం కష్టమనే చెప్పాలి. ఆ ఒక్క ఛేంజ్ చేయకపోయి ఉంటే లాల్ సలామ్ సినిమాకి తెలుగులో కూడా మంచి హైప్ వచ్చేది.