NTV Telugu Site icon

Rajinikanth: జైలర్ దెబ్బకి అరవై లక్షల టికెట్స్ అవుట్

Jailer

Jailer

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. రిలీజ్ అయిన రోజు నుంచి దాదాపు నెల రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర ఊచకోత సాగించిన జైలర్ సినిమా రజినీకాంత్ కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ రేంజ్ సినిమా ఈ మధ్య కాలంలో పడకపోవడంతో ప్రతి ఒక్కరూ రజినీకాంత్ టైమ్ అయిపొయింది అనే కామెంట్స్ చేసారు. రజినీ ఇప్పుడు నంబర్ 1 కాదు అని కోలీవుడ్ సినీ అభిమానులు కూడా మాట్లాడుకునే సమయంలో జైలర్ సినిమా బయటకి వచ్చి 650 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజిని కెరీర్ లోనే కాదు కోలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలోనే సెకండ్ హయ్యెస్ట్ గ్రాస్డ్ సినిమాగా జైలర్ నిలిచింది. ఈ సినిమా బుక్ మై షోలో దాదాపు 6 లక్షలకి పైగా టికెట్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి వారానికే కావడం విశేషం. అసలు అంచనాలు లేని ఒక సినిమా కేవలం మౌత్ టాక్ తో ఈ రేంజ్ బుకింగ్స్ ని రాబట్టింది. డే 1 కన్నా డే 3, 4, 5ల్లో జైలర్ సినిమా ఎక్కువ బుకింగ్స్ రాబట్టింది. ఈ 6 మిలియన్ టికెట్స్ లో 1.5 మిలియన్ టికెట్స్ జైలర్ సినిమాని రెండో సారి చూడడానికి బుక్ చేసుకున్నారు.

అసలు ఇప్పుడు జైలర్ సినిమా బుకింగ్స్ లెక్కల గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే… సోషల్ మీడియాలో జైలర్, లియో సినిమాల ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. బుక్ మై షోలో మా సినిమా ఎక్కువ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది అంటే కాదు మా సినిమానే ఎక్కువ చేసుకుంది అంటూ విజయ్ ఫ్యాన్స్, రజినీ ఫ్యాన్స్ వెర్బల్ వార్ కి దిగుతున్నారు. లియో సినిమా మొదటి వారంలో 7 మిలియన్ టికెట్స్ ని సొంతం చేసుకుంది అనేది విజయ్ ఫ్యాన్స్ కామెంట్. అదే నిజం అయితే జైలర్ సినిమా కలెక్షన్స్ ని ఇప్పటికే బ్రేక్ చేయాలి కదా కానీ అలా జరగలేదు అంటే ఫేక్ అనే అర్ధం అని రజినీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫ్యాన్ వార్ లియో థియేట్రికల్ రన్ ఎండ్ అయ్యే వరకూ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికైతే లియో సినిమా విజయ్ కెరీర్ హయ్యెస్ట్ గా నిలిచింది, లాంగ్ రన్ లో జైలర్ కలెక్షన్స్ ని బీట్ చేస్తుందో లేదో చూడాలి.

Show comments