NTV Telugu Site icon

Rajini: రజినీ ట్రెండ్ లో ఉన్నాడు… కారణాలు మాత్రం రెండే…

Rajinikanth

Rajinikanth

ప్రస్తుతం ఇండియాలో తలైవర్ రజినీకాంత్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. రజినీ ట్యాగ్ ట్రెండ్ అవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘100 ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్’ ఈవెంట్ లో రజినీకాంత్ చేసిన కామెంట్స్. ఈ కామెంట్స్ ని ఒక్కొక్కరూ ఒక్కోలా రిసీవ్ చేసుకోని కొంతమంది రజినీని సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సపోర్ట్ చేసినా, వ్యతిరేకించినా వినిపించేది మాత్రం రజినీ పేరే కాబట్టి ఈ కారణంగా ‘APShouldApologizeRajini’ అనే ట్యాగ్ గత మూడు నాలుగు రోజులుగా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇది రోజు రోజుకీ పెరుగుతూనే ఉండడంతో రజినీ ఇండియా వైడ్ హాట్ టాపిక్ అయ్యాడు.

ఇక రజినీ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి ఇంకో కారణం, లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం దళపతి విజయ్ తో లోకేష్ కనగారాజ్ చేస్తున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ‘లియో’ షెడ్యూల్ బ్రేక్ లో ఉంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ చెన్నైలోనే స్టార్ట్ కానుంది, ఈ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే వరకూ టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో లోకేష్, సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలిసి కథ చెప్పబోతున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఎప్పుడో అనౌన్స్ అవ్వాల్సిన కాంబినేషన్ చాలా రోజులుగా సెట్ అవ్వలేదు. ఈ నెలలో జరగబోయే మీటింగ్ తో ఎదో ఒకటి తేలిపోతుంది, రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తుంది.

లోకేష్ కనగరాజ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కి రజినీకాంత్ కి ఉన్న ఇమేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ ఇద్దరూ కలిస్తే అది బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడనంత మోస్ట్ డేంజరస్ కాంబినేషన్ గా మారుతుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యి స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా కాకుండా  LCUలోకి సూపర్ స్టార్ ఎంటర్ అయితే రజినీకాంత్ Vs కమల్ హాసన్ సినిమా పడే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ ఎగ్జైటింగ్ ఫేస్ ఆఫ్ గా రజినీకాంత్ Vs కమల్ హాసన్ సినిమా అనౌన్స్ అయితే బాక్సాఫీస్ తగలబడి పోవడం గ్యారెంటీ. అది కూడా రజినీ గ్రే షేడ్ క్యారెక్టర్ లో, కమల్ పాజిటివ్ క్యారెక్టర్ లో సినిమా చేస్తే దాని రిజల్ట్ ని ఊహించడం కూడా కష్టమే. ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఆ కాంబినేషన్ లో సినిమా పడాలి అంటే లోకేష్ కథకి రజినీకాంత్ ఓకే చెప్పాలి. మరి లోకేష్ ఏం ప్లాన్ చేసాడో? రజినీకాంత్ ని ఏ కథ చెప్పి ఒప్పిస్తాడో చూడాలి.

Show comments