Rajini: రజినీ ట్రెండ్ లో ఉన్నాడు… కారణాలు మాత్రం రెండే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఇండియాలో తలైవర్ రజినీకాంత్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. రజినీ ట్యాగ్ ట్రెండ్ అవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘100 ఇయర్స్ ఆఫ్ ఎన్టీఆర్’ ఈవెంట్ లో రజినీకాంత్ చేసిన కామెంట్స్. ఈ కామెంట్స్ ని ఒక్కొక్కరూ ఒక్కోలా రిసీవ్ చేసుకోని కొంతమంది రజినీని సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సపోర్ట్ చేసినా, వ్యతిరేకించినా వినిపించేది మాత్రం రజినీ పేరే కాబట్టి ఈ కారణంగా ‘APShouldApologizeRajini’ అనే ట్యాగ్ గత మూడు నాలుగు రోజులుగా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇది రోజు రోజుకీ పెరుగుతూనే ఉండడంతో రజినీ ఇండియా వైడ్ హాట్ టాపిక్ అయ్యాడు.
ఇక రజినీ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి ఇంకో కారణం, లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం దళపతి విజయ్ తో లోకేష్ కనగారాజ్ చేస్తున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ‘లియో’ షెడ్యూల్ బ్రేక్ లో ఉంది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ చెన్నైలోనే స్టార్ట్ కానుంది, ఈ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే వరకూ టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో లోకేష్, సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలిసి కథ చెప్పబోతున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఎప్పుడో అనౌన్స్ అవ్వాల్సిన కాంబినేషన్ చాలా రోజులుగా సెట్ అవ్వలేదు. ఈ నెలలో జరగబోయే మీటింగ్ తో ఎదో ఒకటి తేలిపోతుంది, రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని కోలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తుంది.
Also Read
లోకేష్ కనగరాజ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కి రజినీకాంత్ కి ఉన్న ఇమేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ ఇద్దరూ కలిస్తే అది బాక్సాఫీస్ దగ్గర ముందెన్నడూ చూడనంత మోస్ట్ డేంజరస్ కాంబినేషన్ గా మారుతుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యి స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా కాకుండా LCUలోకి సూపర్ స్టార్ ఎంటర్ అయితే రజినీకాంత్ Vs కమల్ హాసన్ సినిమా పడే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ ఎగ్జైటింగ్ ఫేస్ ఆఫ్ గా రజినీకాంత్ Vs కమల్ హాసన్ సినిమా అనౌన్స్ అయితే బాక్సాఫీస్ తగలబడి పోవడం గ్యారెంటీ. అది కూడా రజినీ గ్రే షేడ్ క్యారెక్టర్ లో, కమల్ పాజిటివ్ క్యారెక్టర్ లో సినిమా చేస్తే దాని రిజల్ట్ ని ఊహించడం కూడా కష్టమే. ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఆ కాంబినేషన్ లో సినిమా పడాలి అంటే లోకేష్ కథకి రజినీకాంత్ ఓకే చెప్పాలి. మరి లోకేష్ ఏం ప్లాన్ చేసాడో? రజినీకాంత్ ని ఏ కథ చెప్పి ఒప్పిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!