2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణతో బాక్సాఫీస్ వార్ కి దిగాడు. ఈ ఇద్దరి జరిగిన సినిమా పోరులో సినిమానే గెలిచింది. వాల్తేరు వీరయ్య, వీర సింహ రెడ్డి సినిమాలని ఆడియన్స్ ఆదరించారు. చిరు వింటేజ్ స్టైల్ మాస్ చూపిస్తే, బాలయ్య తనకి టైలర్ మేడ్ ఫ్యాక్షన్ రోల్ లో సత్తా చూపించాడు. డికేడ్స్ తర్వాత డెమీ గాడ్స్ మధ్య జరిగిన ఈ కలెక్షన్స్ యుద్ధం సినీ అభిమానులకి మాత్రం ఫుల్ కిక్ ఇచ్చింది. ఇప్పుడు ఆగస్టు నెలలో కూడా ఇలాంటి వార్ చూడాల్సి వచ్చేలా ఉంది. ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా రిలీజ్ కానుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ఈరోజు రిలీజ్ కానుంది. తమిళ వేదాలం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాపై మెగా అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మెహర్ రమేష్ ఈ సినిమాని ఎలా తెరకెక్కించాడో అనే భయం రెగ్యులర్ మూవీ లవర్స్ లో ఉంది కానీ ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తే మాత్రం పాజిటివ్ గానే ఉన్నాయి. రిలీజ్ డేట్ లాక్ చేసి ప్రమోషన్స్ చేస్తున్న ఈ సినిమాకి పోటీగా రజినీకాంత్ రేస్ లోకి వచ్చాడు.
చిరు కన్నా ఒక్క రోజు ముందు ఆగస్టు 10న రజినీకాంత్ ‘జైలర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. జైలర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్, ఆగస్టు 10న మీట్ అవుదాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోస్ట్ చేసిన ఫొటోస్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కలిసి నటిస్తున్న జైలర్ సినిమాపై సౌత్ ఇండియా మొత్తం భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులో కూడా జైలర్ సినిమా థియేట్రికల్ రైట్స్ ని ఏషియన్ సొంతం చేసుకుంది కాబట్టి జైలర్ కి సాలిడ్ నంబర్స్ లో థియేటర్స్ దక్కడం గ్యారెంటీ. ఇంత భారీగా రిలీజ్ అవ్వనున్న జైలర్ కి భోళా శంకర్ సినిమాకి మధ్య ఒక్క రోజు గ్యాప్ మాత్రమే ఉంది. ఇలాంటి సయమంలో ఎవరు హిట్ కొడతారు? ఎవరు ప్లాప్ ఇస్తారు అనేది ఇంటరెస్టింగ్ విషయంగా మారింది.
It's a wrap for #Jailer! Theatre la sandhippom 😍💥#JailerFromAug10@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @kvijaykartik @Nirmalcuts @KiranDrk @StunShiva8 pic.twitter.com/Vhejuww4fg
— Sun Pictures (@sunpictures) June 1, 2023
