కోవిడ్-19 కారణంగా కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. నిన్న ఇటీవల ఆయన యూఎస్ ట్రిప్ ముగించుకుని వచ్చారు. ఆ సమయంలోనే దగ్గు రాగా, కమల్ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో సెల్ఫ్ ఐసొలేషన్లోకి వెళ్లి, వైద్యుల సూచనతో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కమల్ అభిమానులకు స్వయంగా తనకు కరోనా సోకిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నిన్న సాయంత్రం ఆయన కూతురు, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కమల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చింది. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ కృతజ్ఞతలని, కమల్ కోలుకుంటున్నారని అన్నారు. తాజాగా రజనీకాంత్ తన స్నేహితుడి క్షేమం గురించి ఆరా తీశారట.
Read also : నిక్ బ్రదర్స్ పై ప్రియాంక చోప్రా దారుణమైన రోస్టింగ్… సమంత స్పందన
రజనీ నిన్న కమల్‌కి ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కోలీవుడ్ దిగ్గజాలు కమల్ హాసన్, రజనీకాంత్ 4 దశాబ్దాలకు పైగా మంచి స్నేహితులు. కాగా రజనీతో పాటు ప్రముఖ తమిళ ప్రముఖులు ప్రభు, శరత్‌కుమార్, విష్ణు విశాల్, శివకార్తికేయన్, ఎస్పీ ముత్తురామన్, లోకేష్ కనగరాజ్, ఫహద్ ఫాసిల్, అట్లీ, ఇషారి గణేష్, విక్రమ్ ప్రభు కూడా దిగ్గజ నటుడు, చిత్ర నిర్మాత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నిన్న శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేసి ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు.
