Site icon NTV Telugu

Coolie : రజినీకాంత్ ‘కూలీ’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Coolie

Coolie

Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన భారీ బడ్జెట్ మూవీ కూలీ. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేశాడు. ఆగస్టు 14న రాబోతున్న ఈ మూవీ గురించి భారీ అప్డేట్ వచ్చేసింది. మొన్న లోకేష్ మాట్లాడుతూ.. ఈ మూవీకి ట్రైలర్ ఏమీ ఉండదని.. డైరెక్ట్ రిలీజ్ చేస్తామన్నాడు. కానీ సడెన్ గా ట్రైలర్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 2న కూలీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఎల్ సీయూ వరల్డ్ లోనే వస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే హైప్ పెంచేసింది.

Read Also : HHVM : క్రిష్ కథతో వీరమల్లు సెకండ్ పార్టు..!

ఇందులో రజినీ కాంత్ లుక్స్, పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీలో నాగార్జున విలన్ గా నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సరికొత్తగా ఆయన ఇందులో కనిపించబోతున్నాడంట. అందుకే తెలుగు నాట ఈ మూవీపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగులో భారీ బిజినెస్ చేసుకుంది. త్వరలోనే ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ప్రమోషన్ల పరంగా మూవీకి మంచి బజ్ ఉంది. అయితే ట్రైలర్ ను ఆగస్టు 02న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు గానీ.. టైమ్ ఏమీ ప్రకటించలేదు. దాని గురించి ఆ రోజే అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ కు మంచి భారీ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. ట్రైలర్ తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read Also : Rakul Preet : పనికిమాలిన వాళ్లు ఎక్కువయ్యారు.. రకుల్ ఘాటు కామెంట్లు

Exit mobile version