Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీపై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. లోకేష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున విలన్ రోల్ చేస్తున్నాడు. అలాగే అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. మూవీపై మొదటి నుంచి భారీగా అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో అంచనాలు ఎక్కువగా ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. తాజాగా కేరళలో మూవీ బజ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read Also : Ghati : పాపం అనుష్క.. ఎన్ని వాయిదాలు వేసినా లాభం లేకపాయే..
కేరళలో టికెట్ల కోసం థియేటర్ దగ్గర ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. థియేటర్ గేట్లు తెరవగానే అడ్వాన్స్ టికెట్ల కోసం ఎగబడటం చూస్తుంటే మూవీకి ఏ స్థాయి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కేరళ నుంచి ఈ సినిమాలో పెద్ద స్టార్లు ఎవరూ నటించకపోయినా అక్కడ ఈ స్థాయి క్రేజ్ ఏర్పడింది సినిమాకు. రిలీజ్ అయ్యాక ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లు ఓ రేంజ్ లో ఉండే ఛాన్స్ఉంది. ప్రస్తుతానికి భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. లోకేష్ డైరెక్షన్ పై ఉన్న నమ్మకంతో పాటు రజినీకి ఉన్న ఫాలోయింగ్ ఈ సినిమాను వేరే లెవల్ కు తీసుకెళ్తోంది. పైగా ఇందులో ఎక్కువ మంది స్టార్లు నటిస్తుండటం మరో విషయం. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
Read Also : The Paradise : ది ప్యారడైజ్ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..
Massive fan craze storms theatres for just the advance booking of #Coolie in Thrissur, Kerala!🔥🔥🔥#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja… pic.twitter.com/nYWOQNfHSg
— Sun Pictures (@sunpictures) August 8, 2025
