NTV Telugu Site icon

Laal Salam: అప్పుడే ‘లాల్ సలాం’ పూర్తి చేసేసిన రజినీకాంత్

Rajanikanth

Rajanikanth

Rajinikanth Lal Salaam Shoot Completed: ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘లాల్ సలాం’ మీద ప్రకటించిన నాటి నుంచే అంచనాలు ఉన్నాయి. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ సినిమాను ర‌జినీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముంబై డాన్‌ మొయినుద్దీన్ భాయ్‌గా సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కీలక పాత్రలో న‌టిస్తుండ‌టం విశేషం. ర‌జినీకాంత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్ త‌దిత‌రులు ఇతర ముఖ్యమైన పాత్రలలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో మొయినుద్దీన్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్న రజినీకాంత్ ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు.

Shah Rukh Khan : న‌య‌న‌తార భ‌ర్త‌కు షారుఖ్ ఖాన్‌ వార్నింగ్.. విక్కీ షాకింగ్ రిప్లై

ఈ విష‌యాన్ని సినిమా డైరెక్టర్ ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ‘‘మీతో కలిసి సినిమా చేయడం ఓ అద్భుతం, నాన్నా. మీరు ఎప్పుడూ నటనతో మ్యాజిక్ చేస్తుంటారు ‘లాల్ సలాం’లో మొయినుద్దీన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి’’ అయింది అంటూ అని ఆమె పేర్కొన్నారు. ర‌జినీకాంత్ స‌హా ఎంటైర్ యూనిట్ క‌లిసి దిగిన ఫొటోను ఆమె షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ రీసెంట్‌గా విడుద‌లైన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 2తో సూపర్ సక్సెస్‌ను సాధించగా అదే నిర్మాణ సంస్థ నుంచి రానున్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకి ఎ.ఆర్‌.రెహ‌మాన్‌ సంగీతం అందిస్తుండగా విష్ణు రంగస్వామి సినిమాటోగ్ర‌ఫీ, బి ప్ర‌వీణ్ భాస్క‌ర్‌ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.