NTV Telugu Site icon

Rajini: జైలర్ నుంచి బయటకి వచ్చాడు కానీ యూనిఫార్మ్ మాత్రం వదలట్లేదు

Rajinikanth

Rajinikanth

జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన పని అయిపొయింది అనే కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికీ హిట్ సౌండ్ రీసౌండ్ వచ్చేలా వినిపించాడు రజినీ. 560 కోట్లు రాబట్టిన జైలర్ సినిమా కోలీవుడ్ కి ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి రెడీగా ఉంది. దాదాపు దశాబ్దం తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన రజినీకాంత్, ఈసారి ఎక్స్పరిమెంట్ చేయడానికి సిద్ధమయ్యాడు. తన నెక్స్ట్ సినిమాని జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తో చేయబోతున్నాడు రజినీ. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటూ ఉంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తుండడం విశేషం. ఇండియన్ సూపర్ స్టార్స్ అయిన అమితాబ్-రజినీకాంత్ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ మూవీ రేంజ్ ఎలా ఉండబోతుందో ఊహించొచ్చు. అయితే జ్ఞానవేల్ కాబట్టి రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమా కాకుండా కొత్త కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ లో రజినీకాంత్ స్క్రీన్ టైమ్ పైన కూడా కోలీవుడ్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రజినీకాంత్ ఎక్కువ డేట్స్ ఇవ్వలేదు, ఎక్కువ సేపు సినిమాలో కనిపించడు, సెకండ్ హాఫ్ లో మాత్రమే ఉంటాడు… ఇలా అనేక మాటలు వినిపిస్తున్నాయి. వీటిలో ఎంతవరకూ నిజముంది అనే విషయం తెలియదు కానీ టీజే జ్ఞానవేల్ ఒక మంచి సినిమాని ఇవ్వగలడు అనే విషయం మాత్రం గ్యారెంటీగా చెప్పగలం. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఫోటో షూట్ జరుగుతుందట. అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఈ ఫోటోషూట్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ అవ్వగానే సెప్టెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వనుందని, చెన్నైలో వేసిన భారీ సెట్ లో ఈ షూటింగ్ స్టార్ట్ అవ్వనుందని సమాచారం. ఈ సినిమాలో రజినీకాంత్ ఒక ఎంకౌంటర్ లో సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. జైలర్ సినిమాలో యూనిఫార్మ్ వేసి ఇండస్ట్రీ కొట్టిన రజినీ, తలైవర్ 170 సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Show comments