NTV Telugu Site icon

‘వరల్డ్ ఆఫ్ సేనాపతి”… ఉత్కంఠభరితంగా క్రైమ్ థ్రిల్లర్ ట్రైలర్

Senapathi

ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓటిటి స్పేస్‌లోకి “సేనాపతి” అనే వెబ్ ఫిల్మ్‌తో అరంగేట్రం చేయబోతున్నారు. ఈ వెబ్ మూవీ డిసెంబర్ 31న ఆహా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది. తాజాగా ‘వరల్డ్ ఆఫ్ సేనాపతి’ పేరుతో ఒక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను చూస్తుంటే మేకర్స్ వీక్షకుల కోసం ఒక గ్రిప్పింగ్ క్రైమ్ కథతో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నారని స్పష్టం అవుతోంది. 2.31 నిమిషాల పాటు సాగే ఈ వీడియోలో క్రూరమైన నేరస్తుల ముఠా మధ్యలో చిక్కుకునే చురుకైన కుటుంబ వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ పాత్రను పరిచయం చేశారు. ఈ క్రైమ్ వరల్డ్ నుండి బయటకు రావడానికి ఆయన తన తెలివిని ఎలా ఉపయోగిస్తాడు ? అనేది సేనాపతి కథాంశం.

నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, హర్షవర్ధన్ మరియు రాకేందు మౌళి కీలక పాత్రల్లో నటిస్తున్న సేనాపతిలో రాజేంద్ర ప్రసాద్ విభిన్నమైన లుక్ లో కనిపించారు. గతంలో ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’ చిత్రాలకు దర్శకత్వం వహించిన పవన్ సాదినేని ఈ వెబ్ ఫిలింకు దర్శకత్వం వహించగా ఈ చిత్రాన్ని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుస్మిత కొణిదెల మరియు విష్ణు ప్రసాద్ నిర్మించారు.