Rajendra Prasad: సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కామెడీతో నవ్వించడమే కాదు.. తన నటనతో కన్నీళ్లు కూడా పెట్టించగలడు. ప్రస్తుతం సపోర్టివ్ క్యారెక్టర్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇక సినిమాల్లో ఎంతో కామెడీ చేస్తాడో.. స్టేజిపై కూడా తనదైన మాటలతో నవ్విస్తూ ఉంటాడు. తాజాగా రాజేంద్ర ప్రసాద్, నరేష్ , పవిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన సెకండ్ ఇన్నింగ్స్ సినిమా ప్రెస్ మీట్ లో నరేష్ పై మంచి సెటైర్లు వేసి పాత్రికేయలను కడుపుబ్బా నవ్వించాడు. ఈ సినిమా షూటింగ్ లో జరిగిన పెళ్లి వీడియోనే నరేష్ పోస్ట్ చేస్తూ పవిత్రతో తనకు వివాహం అయ్యిందని, తమను ఆశీర్వదించమని కోరిన సంగతి తెల్సిందే. ఆ తరువాత ఈ పెళ్లి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరి డౌట్స్ క్లియర్ చేస్తానని చెప్పిన నరేష్.. ఆ విషయాలను ఈ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా అన్ని మంచి శకునములే సినిమా ప్రెస్ మీట్ లో రాజేంద్ర ప్రసాద్ , నరేష్ వరుస పెళ్లిళ్ల గురించి వేసిన సెటైర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Suman: పవన్ సీఎం అవ్వాలని దేవుడు రాసిపెట్టి ఉంచాడు.. సుమన్ సంచలన వ్యాఖ్యలు
“వాడు కత్తే.. నరేష్ మామూలోడు కాదు.. కత్తి.. మీ అందరికి తెలుసు.. బాగా కత్తి వాడు. వాడి రేంజ్ కత్తి నేను కాదు.. మేమిద్దరం బ్రదర్స్ లాంటివాళ్ళం. అందుకే జోక్ గా అంటున్నా.. చూశారా ఎప్పుడు పెళ్లి కొడుకులానే ఉంటాడు.. ఇప్పుడు కూడా పెళ్లి కొడుకులని ఉన్నాడు.. అని అనగానే.. నరేష్ స్పందిస్తూ.. పెళ్లి కొడుకులా ఉండడం వేరు.. నిత్యం పెళ్ళికొడుకులా ఉండడం వేరు అని చెప్పుకొచ్చాడు. దీంతో రాజేంద్ర ప్రసాద్.. నరేష్ నిత్యా పెళ్లి కొడుకువు నువ్వు ” అంటూ చెప్పుకురావడం తో అక్కడ ఉన్న పాత్రికేయులు అందరు పొట్ట పట్టుకొని నవ్వడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే నరేష్- పావోత్ర పెళ్లిపై ఇంకా క్లారిటీ రాలేదు. నరేష్ మూడో భార్య రమ్య విడాకులు ఇవ్వకపోవడంతో ఇంకా డీలే అయ్యే అవకాశం ఉందట. మరోపక్క రమ్య తనకు విడాకులు వద్దు అని చెప్పడంతో వీరి పెళ్లి అసలు జరుగుతుందా..? లేదా..? అనేది మిస్టరీగా మారింది .
నరేష్ వరుస పెళ్లిళ్లపై సెటైర్లు వేసిన రాజేంద్రప్రసాద్..
FULL VIDEO – https://t.co/WtHz4yb50Z#Naresh #Pavitralokesh #pavitranaresh #rajendraprasad #AnniManchiSakunamule #NTVTelugu #NTVENT pic.twitter.com/goWzMSgigT
— NTV Telugu (@NtvTeluguLive) March 23, 2023