Site icon NTV Telugu

కనకదుర్గమ్మ సేవలో రాజేంద్రప్రసాద్… ‘మా’పై నో కామెంట్స్

Rajendra Prasad Visits Kanaka Durga Temple in Vijayawada

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని కుటుంబ సభ్యులతో సహా పూజా కార్యక్రమాలతో సేవించి, తీర్థ ప్రసాదాలు, ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ “ఓం నమో భవానీ… అమ్మ మా అమ్మ.. దుర్గమ్మను నాకు చిన్నప్పుడు చూపించి ఈవిడే నీ అమ్మరా అన్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. మేళతాళాలు కొని తెచ్చి అమ్మకి ఇచ్చే అవకాశం నాకు దక్కింది. మూల నక్షత్రం రోజు రావడం కుదరలేదు. నా మనవరాలుతో సహా అందరం కలిసి వచ్చాం. ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు” అంటూ దుర్గమ్మను దర్శించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఆలయ అధికారులు పండగ ఏర్పాట్లు చేసిన తీరుపై ప్రశంసలు కురిపించారు.

Read Also : ‘మా’ ఎన్నికలపై కోర్టుకు ప్రకాష్ రాజ్

ఈ సందర్భంగా ‘మా’లో జరుగుతున్న తాజా పరిణామాల గురించి విలేఖరులు ప్రశ్నించగా ‘నో కామెంట్’ అంటూ సమాధానం దాటవేశారు. రాజేంద్రప్రసాద్ కూడా గతంలో ‘మా’ అధ్యక్షుడిగా పని చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ‘మా’లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ వర్గం సోమవారం కోర్టు తలుపు తట్టబోతున్నారు. ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Exit mobile version