‘మా’ ఎన్నికలపై కోర్టుకు ప్రకాష్ రాజ్

‘మా’లో ఇంకా వేడి తగ్గలేదు. గత మూడు నెలల ముందు నుంచే ‘మా’ ఎన్నికల గురించి వస్తున్న వార్తలు హైలెట్ అవుతున్నాయి. అక్టోబర్ 10న జరిగిన ‘మా’ ఎన్నికల్లో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మంచు విష్ణు ప్యానల్ గెలుపొందింది. గెలుస్తాడనుకున్న ప్రకాష్ రాజ్ ఓడిపోయి రాజీనామా బాట పట్టాడు. ఇక ఆయన ప్యానల్ నుంచి గెలుపొందిన పలువురు సభ్యుల బృందం సైతం రాజీనామాలు చేస్తాము. ‘మా’ మెంబర్స్ గా కొనసాగుతూ మంచు విష్ణు పనితీరును ప్రశ్నిస్తామని అన్నారు. మరోవైపు మంచు విష్ణు అందరినీ కలుపుకుని వెళ్తాము. పెద్దలందరి ఆశీర్వాదం, ఆలోచనలు, సూచనలు నాకు కావాలి. ఎవ్వరి రాజీనామాలు ఆమోదించేది లేదు. ఈసీ సభ్యులతో మీటింగ్ అనంతరం రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని అంటున్నాడు.

Read Also : పొట్టివాడు నిజంగానే గట్టివాడు!

ఇక మంచు విష్ణు ప్యానల్ గెలుపొందానికి రిగ్గింగ్ చేశారని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ ఎన్నికలు జరిగిన రోజు సీసీటీవీ ఫుటేజ్ కావాలంటూ ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు బహిరంగ లేఖ రాశారు. తాజాగా ఆయన సోమవారం ఈ విషయమై కోర్టు మెట్లు ఎక్కనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు జరిగిన తీరుపై అసంతృప్తి గా వున్న ప్రకాష్ రాజ్ వర్గం నిన్న ఇవ్వాళ ఇదే అంశం పై చర్చించి పోలింగ్ సమయంలో తన‌ ప్యానెల్ సభ్యులను ఎలా బెదరిచారో చెప్పడానికి సాక్ష్యాలుగా సీసీ ఫుటేజ్ ను కోరినట్టు సమాచారం. కౌంటింగ్ జరిగిన తీరును సరిగ్గా లేదని ఆరోపిస్తూ ప్రకాష్ రాజ్ బృందం.కోర్టుకు ఎక్కేందుకు సిద్ధమైంది.

-Advertisement-'మా' ఎన్నికలపై కోర్టుకు ప్రకాష్ రాజ్

Related Articles

Latest Articles