Rowdy Janardhan : ‘రౌడీ జనార్దన్’ లో విలన్‌గా కొత్త లుక్‌తో రాజశేఖర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు రెండు కొత్త ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇప్పటికే షూటింగ్‌లో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు మరో హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన్’, ఇది రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నుంచి అధికారికంగా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది.
Also Read : Radhika Sarathkumar : సీనియర్ నటి రాధిక తల్లి గీత కన్నుమూత..
Also Read
- Toxic: 'టాక్సిక్'కి సెన్సార్ కష్టమేనా?
- Tollywood Stars: బాలయ్య నుంచి ప్రభాస్ వరకు.. షూటింగ్‌లో గాయపడిన టాలీవుడ్ స్టార్స్ వీరే!
- Mani Ratnam: సెట్స్‌పైకి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్.. ఒకే ఫ్రేమ్‌లో సాయి పల్లవి-విజయ్ సేతుపతి!
- Varun Tej: రిలీజ్‌కు ముందే వరుణ్ తేజ్ జాక్‌పాట్.. 'కొరియన్ కనకరాజు' రూ.26 కోట్ల బిజినెస్?
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముఖ్య ఆకర్షణగా నిలిచేది విలన్ పాత్రే అంటా. కాగా ఈ పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ ను ప్రతినాయకుడిగా ఎంచుకున్నారు. కాగా ఆయన లుక్ పూర్తిగా కొత్తగా, భిన్నంగా రూపొందించబడ్డట్లు తెలుస్తోంది. ఇది ఆయన కెరీర్‌లోనే శక్తిమంతమైన పాత్రగా ఉండనుంది. ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తయ్యిందట. చిత్ర దర్శకుడు రాజశేఖర్ పాత్రను పునరావిష్కరించి, గతంలో ప్రేక్షకులు చూడని విధంగా రూపొందించినట్లు తెలిసింది.
సినిమా కధ గ్రామీణ నేపథ్యం తో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఇందులో రాజకీయ అంశాలు కూడా కీలకంగా ఉంటాయని, కథలో కథానాయకుడు విజయ్ దేవరకొండ ఎదుర్కొనే సవాళ్లను చూపిస్తుందట. కథలో విలన్ పాత్ర ప్రధానమైనది కాబట్టి, రాజశేఖర్ క్యారెక్టర్ మైండ్ల్ బ్లోవింగ్‌గా రూపొందించబడినట్లు తెలుస్తుంది. ఇక విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. తన గ్లామర్, నేచురల్ పర్ఫార్మెన్స్‌తో సినిమాకు బలాన్ని చేకూరుస్తారని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. మొత్తానికి, ‘రౌడీ జనార్దన్’ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద హైప్ క్రియేట్ చేస్తోంది. ప్రత్యేకంగా రాజశేఖర్ కొత్త లుక్, విజయ్ దేవరకొండ ఎమోషనల్ యాక్షన్, కీర్తి సురేష్ నటన సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే షూటింగ్, లేట్ 2025 లేదా 2026 మధ్య రిలీజ్ క్రమంలో అభిమానులను తెర పై కొత్త సక్సెస్ స్టోరీగా ఎదురుచూస్తున్నట్లు ఉంది.
తాజావార్తలు
-
Gujarat Floods: గుజరాత్‌ను ముంచెత్తిన వరదలు.. నీళ్లల్లోనే పలు నగరాలు
-
Bitchat: సీజేపీ నిరసనల్లో ఉపయోగించిన ‘‘బిట్‌చాట్’’ యాప్‌పై కేంద్రం చర్యలు..
-
Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా…
-
CJI Surya kant: సీజేపీ నిరసనల పిటిషన్‌పై సూర్యకాంత్ కీలక ప్రకటన
-
Paper Leak Bill: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు, రూ. 10 కోట్ల జరిమానా.. ఆమోదించిన కేబినెట్..
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!