Site icon NTV Telugu

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సినిమాలో విలన్ గా సీనియర్ హీరో..?

Vijay Deverakonda

Vijay Deverakonda

Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఓ వైపు కింగ్ డమ్ మూవీ చేస్తూనే ఇంకోవైపు రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే రవి కిరణ్‌ కోలా డైరెక్షన్ లో రౌడీ జనార్ధన్ అనే సినిమా చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు. కాగా ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఇందులో సీనియర్ హీరో విలన్ గా చేస్తున్నారంట. ఆయన ఎవరో కాదు రాజశేఖర్. ఒకప్పుడు రాజశేఖర్ స్టార్ హీరోల్లో ఒకరు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి కొంత కాలం బ్రేక్ ఇచ్చారు.

Read Also : Son Calls his Father: నాన్నా నన్ను చిత్ర హింసలు పెట్టి చంపేస్తున్నారు..! సౌదీ నుంచి ఏపీ యువకుడి ఫోన్‌..

రీ ఎంట్రీలో కూడా హీరోగా సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఇప్పుడు విలన్ పాత్రల్లో నటించేందుకు ఓకే చెబుతున్నాడంట. రౌడీ జనార్ధన్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పేశాడంట ఈయన. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది. గతంలో నితిన్ హీరోగా వచ్చిన క్స్ ట్రా ఆర్డినరీ సినిమాలో కనిపించాడు రాజశేఖర్. అప్పటి నుంచి మరే సినిమాలో కనిపించలేదు. ఏదైనా పవన్ ఫుల్ రోల్ వస్తే అందులో కనిపించాలని చూస్తున్నాడు. ఇప్పుడు విజయ్ రౌడీ జనార్ధన్ మూవీలో కనిపించబోతున్నాడంట.

Read Also : Balakrishna : జైలర్-2లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బాలయ్య..?

Exit mobile version