SSMB29: ‘వారణాసి’ ఓటీటీ డీల్‌కే వేల కోట్ల ఆఫరా..? రాజమౌళి సినిమా కోసం దిగ్గజ సంస్థల పోటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB29 : ఒక సినిమా విడుదల కాకముందే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం కొత్త కాదు. అయితే షూటింగ్ పూర్తికాకముందే ఓటీటీ, శాటిలైట్ హక్కుల కోసం దిగ్గజ సంస్థలు భారీ మొత్తాలతో పోటీ పడటం మాత్రం చాలా అరుదు. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ విషయంలో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా, మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు ముందే డిజిటల్ హక్కులపై వినిపిస్తున్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
రాజమౌళి సినిమా అంటేనే లోకల్ గానే కాదు, ఓవర్సీస్ లో కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల తర్వాత ఆయన రూపొందిస్తున్న తదుపరి ప్రాజెక్ట్ కావడంతో ‘వారణాసి’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ అంచనాల కారణంగానే సినిమా థియేటర్లలోకి రాకముందే ఓటీటీ సంస్థలు భారీ మొత్తాలతో ముందుకు వస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను, శాటిలైట్ హక్కులను కూడా ఒకేసారి సొంతం చేసుకోవాలని ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ ప్రచార నేపథ్యంలో ప్రస్తుతం రెండు ప్రధాన సంస్థల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. జీ5, జియో హాట్‌స్టార్ ఈ రేసులో ముందున్నాయనే ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటివరకు చిత్రబృందం గానీ, సంబంధిత ఓటీటీ సంస్థలు గానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ రాజమౌళి చిత్రాల మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి భారీ ఆఫర్లు రావడం ఆశ్చర్యకరం కాదనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఇప్పటికే ‘వారణాసి’ షూటింగ్‌పై వస్తున్న ప్రతి చిన్న అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మహేష్ బాబును ఇప్పటివరకు చూడని కొత్త అవతారంలో రాజమౌళి చూపించబోతున్నారనే వార్తలు కూడా సినిమాపై హైప్‌ను మరింత పెంచుతున్నాయి. హాలీవుడ్ రేంజ్ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమాకి విదేశీ మార్కెట్లో కూడా భారీ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఆఫీషియాల్ గా ఒప్పందం ఎవరితో కుదురుతుందో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాజమౌళి, మహేష్ బాబు కలయికలో వస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, ప్రీ రిలీజ్ బిజినెస్‌లో కూడా కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!