NTV Telugu Site icon

Rajamouli: కల్కి ఫస్ట్ గ్లింప్స్.. ఆ ఒక్కటి మిస్ అయ్యింది

Ssr

Ssr

Rajamouli: యంగ్ రెబల్ స్టార్ ను పాన్ ఇండియా స్టార్ గా చేసింది దర్శక ధీరుడు రాజమౌళినే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. అసలు తెలుగు సినిమాను పాన్ ఇండియాకు పరిచయం చేసిందే ఆయన. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ను ఓ రేంజ్ లో మార్చేసిన ఘనత జక్కన్నకే దక్కుతుంది. ఇక రాజమౌళి బాటలోనే నాగ్ అశ్విన్ నడుస్తున్నాడు. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి2989AD. ఈరోజే శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ సినిమా పేరును, ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. సూపర్ హీరోగా ప్రభాస్ ను నాగీ చూపించిన విధానానికి ఫ్యాన్స్ మాత్రమే కాదు టాలీవుడ్ మొత్తం ఫిదా అవుతుంది. సూపర్ .. సూపర్ అంటూ సెలబ్రీటీలు సైతం ప్రభాస్ ను, నాగ్ అశ్విన్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ ఫస్ట్ గ్లింప్స్ పై రాజమౌళి తన స్పందన తెలియజేస్తూ ట్వీట్ చేశాడు.

Sobha Shetty: పిచ్చెక్కిస్తున్న మోనితా అందం.. అసలు డాక్టర్ బాబు ఎలా మిస్ అయ్యాడు..?

“నాగీ, వైజయంతీ మూవీస్ గ్రేట్ జాబ్. ఒక ప్రామాణికమైన భవిష్యత్ చిత్రాన్ని రూపొందించడం చాలా కష్టమైన పని.. మీరు దీన్ని సాధ్యం చేసారు. డార్లింగ్ లుక్ అదిరిపోయింది.. ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది.. రిలీజ్ డేట్.. మిస్ అయ్యింది” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు ప్రభాస్ ను ఈ రేంజ్ లో చూసాక అసలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదన్న విషయం కూడా మర్చిపోయాం.. రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ అభిమానులు సైతం కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. జక్కన్నకే ఫస్ట్ గ్లింప్స్ నచ్చింది అంటే.. ఇక సినిమా గురించి అస్సలు ఆలోచించనవసరం లేదు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరవేస్తున్నారు. మరి ఈ సినీరంతో ప్రభాస్- నాగీ ఎలాంటి రికార్డులు బద్దలు కొడతారో చూడాలి.