NTV Telugu Site icon

Rajamouli: వెకేషన్ లో ఉన్నారు.. వదిలేయండయ్యా

Jakaknna

Jakaknna

Rajamouli: ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది. ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, తారక్ కొత్త సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ, దర్శకుడు రాజమౌళి మాత్రం తదుపరి సినిమాను పట్టాలెక్కించడానికి ఇంకో ఏడాది టైమ్ తీసుకొనేలా కనిపిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత జక్కన్న.. మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. పాన్ వరల్డ్ ను టార్గెట్ చేసినా జక్కన్న.. ప్రస్తుతం ఈ సినిమాస్ స్క్రిప్ట్ వర్క్ లోనే తలమునకలు అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పడమే కానీ.. ఈ సినిమాపై జక్కన్న కానీ, మహేష్ కానీ నోరు విప్పిందే లేదు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా గురించిన అప్డేట్ ఇస్తారా..? అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తమ హీరో సినిమా అప్డేట్ రాకపోతే నెగెటివ్ కామెంట్స్ తో ట్రెండ్ చేయడం ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా అలవాటు పడింది.

Devara: ఎన్టీఆర్ కి సోలో రిలీజ్ కష్టమే… పోటీగా పాన్ ఇండియా సినిమా

ఇక SSMB29 అప్డేట్ ఇవ్వడంటూ అభిమానులు ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఒక ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. తమిళనాడులోని ఒక రిసార్ట్ లో జక్కన్న కుటుంబంతో సహా ఛిల్ల్ అవుతూ కనిపించాడు. ఇక ఈ ఫోటోను షేర్ చేస్తూ.. జక్కన్నా.. అప్డేట్ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. నెటిజన్లు మాత్రం వెకేషన్ లో ఉన్నారు.. వదిలేయండయ్యా అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అప్డేట్ వచ్చే నెలలో ఉండనుందని చెప్పుకొస్తున్నారు. మరి అందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

Show comments