Site icon NTV Telugu

Baahubali The Epic : అది బాహుబలి 3 కాదు.. రాజమౌళి షాకింగ్ స్టేట్ మెంట్

Baahubali Epic

Baahubali Epic

Baahubali The Epic : ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బాహుబలి ది ఎ పిక్ రిలీజ్ కావడానికి రెడీ అయిపోయింది. రేపు ప్రీమియర్స్ పడుతాయి. ఎల్లుండి థియేటర్లలో మూవీ భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి, ప్రభాస్, రానా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ మూవీపై వస్తున్న రకరకాల రూమర్స్ కు ఇందులో రాజమౌళి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరిముఖ్యంగా బాహుబలి 3 ప్రకటన ఈ సినిమాలో ఉంటుందని ఓ ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతుంది. దానిపై రాజమౌళి స్పందించారు. బాహుబలి ది ఎపిక్ సినిమాలో కొన్ని చిన్న చిన్న సీన్స్ యాడ్ చేశామని చెప్పారు.

Read Also : Baahubali The Epic : బాహుబలి సినిమా వద్దన్న రాజమౌళి.. అతని వల్లే చేశారంట

బాహుబలి ది ఎపిక్ మూవీలో పెద్ద సీన్స్ ఏవి యాడ్ చేయలేదు. వాటిపై భారీగా అంచనాలు అస్సలు పెట్టుకోవద్దు. ఏవో సర్ప్రైజ్ లు ఉంటాయని ప్రచారం బాగా జరుగుతుంది. బాహుబలి 3 ని ఈ సినిమాలోని ప్రకటిస్తామని అనుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు. బాహుబలి ది ఎటర్నల్ వార్ టీజర్ను రిలీజ్ చేయబోతున్నాం. అది బాహుబలి త్రీ సినిమా గురించి కాదు. యానిమేటెడ్ మూవీ. అది త్రీడీలో ఉంటుంది అంటూ తెలిపారు రాజమౌళి.

Read Also : Baahubali The Epic : కొత్త సీన్స్ యాడ్ చేయడంపై నిర్మాత క్లారిటీ

Exit mobile version