NTV Telugu Site icon

Rajamouli : Box office king is back రంగంలోకి రాజమౌళి..!

Ss

Ss

 

ఇండియన్ బాక్సాఫీస్ కింగే కాదు.. మాన్‌స్టర్ కూడా అతనే.. రాజమౌళి సినిమా అంటేనే.. వసూళ్ల వర్షం కురిపిస్తుంది. అందుకే దర్శక ధీరుడి నుంచి సినిమా వస్తుందంటే.. ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు.. అదే మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని చెప్పొచ్చు. ట్రిపుల్ ఆర్ తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న జక్కన్న.. ఇప్పుడు మహేష్ ప్రాజెక్ట్ కోసం అసలు సిసలైన రంగంలోకి దిగాడట. మరి రాజమౌళి ఫస్ట్ స్టెప్ ఏంటి..?

రీసెంట్‌గా ట్రిపుల్ ఆర్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు రాజమౌళి. దాదాపు 1150 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ట్రిపుల్ ఆర్.. ఇండియిన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో.. నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో దంగల్, బాహుబలి 2, కెజియఫ్ చాప్టర్ టు నిలిచాయి. అయితే వరుసగా రెండు సార్లు వెయ్యి కోట్లకు పైగా సాధించిన దర్శకుడిగా రాజమౌళి రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక ట్రిపుల్ ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో.. కొన్ని రోజులు రిలాక్స్ అయ్యేందుకు వెకేషన్‌కు వెళ్లాడు రాజమౌళి. అయితే తాజాగా రాజమౌళి ఇండియాకు తిరిగొచ్చినట్టు తెలుస్తోంది. రావడమే ఆలస్యం అన్నట్టు.. మహేష్ ప్రాజెక్ట్‌పై కసరత్తులు కూడా మొదలు పెట్టినట్టు సమాచారం. తన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి.. స్క్రిప్టు పనులు ప్టార్ట్ చేశాడట జక్కన్న. ఇప్పటికే ఈ సినిమా కోసం రెండు లైన్లు అనుకున్న రాజమౌళి.. అందులో ఒకటి లాక్ చేసినట్టు టాక్. ఇక ఇప్పుడు పవర్ ఫుల్ స్క్రిప్టు రెడీ చేసే పనిలో పడ్టాడని తెలియడంతో.. మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ ఏడాది చివరి వరకు స్క్రిప్టు ఫైనల్ చేసి.. వచ్చే ఏడాదిలో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం మహేష్ బాబు ఫారిన్ వెకేషన్లో ఉన్నాడు. తిరిగొచ్చిన తర్వాత త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఆ తర్వాత రాజమౌళి, మహేష్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను భారీ అడ్వెంచర్ యాక్షన్‌గా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.