Raj Tarun : రాజ్ తరుణ్ మళ్లీ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నాడు. మొన్నటి దాకా లావణ్యతో వివాదాలతో సతమతం అయిన ఈ హీరో.. ఇప్పుడిప్పుడే కెరీర్ ను మళ్లీ గాడిలో పెడుతున్నాడు. ఆయన నుంచి ఓ సూపర్ హిట్ వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. ఇలాంటి టైమ్ లో ఆయన రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఓ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇంకోవైపు తమిళంలో కూడా గోలీసోడా ప్రాంచైజ్ లో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఇలా కొత్త సినిమాలతో బిజీగా ఉంటున్న టైమ్ లోనే.. రాజ్ కు అప్పట్లో మంచి హిట్ ఇచ్చిన మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. అదే కుమారి 21 ఎఫ్.
Read Also : Ricky Ponting: విమానం ఎక్కాక.. మనసు మార్చుకున్న రికీ పాంటింగ్!
సూర్య ప్రతాప్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ సినిమాగా 2015లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ రిలీజ్ అయి పదేళ్లు అవుతున్న సందర్భంగా దీన్ని రీ రిలీజ్ చేయాలని చూస్తున్నారంట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రటకన రాబోతోంది. ఈ మూవీకి డీఎస్పీ మ్యూజిక్ అందించగా.. ఇందులోని పాటలు కుర్రాళ్లను ఊపేశాయి. ఈ సినిమా అప్పట్లో బోల్డ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Read Also : NTR: ఎన్టీఆర్ కుమార్తెల చేతుల మీదుగా ‘ఎన్టీఆర్’ లాంఛ్!
