టాప్ యాంగిల్ సెల్ఫీతో టాప్ లేపిన ‘రత్తాలు’

‘కాంచనమాల కేబుల్ టీవీ’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాయ్ లక్ష్మీ. ఈ చిత్రం తరువాత పలు సినిమాల్లో మెరిసినా అమ్మడిని మాత్రం తెలుగు ప్రేక్షకులు స్పెషల్ సాంగ్ లతోనే గుర్తుపెట్టుకున్నారు. మెగాస్టార్ చిరుతో రత్తాలు రత్తాలు అంటూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తోబా తోబా అంటూ చిందులేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ సినిమాల్లో కనిపిస్తోంది.

ఇక ఈ మధ్య కాస్త బక్కచిక్కిన ఈ భామ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు సెగలు పుట్టిస్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ మరో హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఆరెంజ్ కలర్ బికినీలో సెగలు పుట్టిస్తోంది. కెమెరా టాప్ యాంగిల్ పెట్టి ఎద అందాలను ఎరగావేసి అలా కునుకు వచ్చినట్లు లుక్ ఇచ్చి కుర్రకారు టాప్ లేపేసింది. ప్రస్తుతం అమ్మడి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ నటించిన ‘గర్జన’ సినిమా విడుదలకు సిద్దమవుతుంది.

Related Articles

Latest Articles