Raj B Shetty’s ‘Toby’ gets a release date: కన్నడ సినీ పరిశ్రమ నుంచి వస్తున్న సినిమాలను సైతం మన ప్రేక్షకులు ఆదరిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అక్కడ నుంచి వచ్చిన కేజిఎఫ్, చార్లీ త్రిబుల్ సెవెన్, కాంతార లాంటి సినిమాలను మన ప్రేక్షకులు ఆదరించారు. అలాగే తెలుగులో రిలీజ్ కాకపోయినా గరుడ గమన వృషభవాహన అనే సినిమా మన తెలుగు ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చేసింది. ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ సినిమాని దాదాపు మూవీ లవర్స్ అందరూ చూసేశారు. ఇక ఆ సినిమా దర్శకుడు రాజ్ బి శెట్టి హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది. టోబి అనే సినిమాతో ఆయన మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Also Read: Adipurush: తెలుగు బుకింగ్స్ ఓపెనే అవ్వలేదు.. కానీ లక్ష టికెట్లు అమ్ముడయ్యాయ్?
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో రాజ్ బి శెట్టి హీరోగా నటిస్తుండగా ఆయన దగ్గర ఒకప్పుడు అసిస్టెంట్ గా పని చేసిన బాసిల్ ఆల్చక్కల్ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఫస్ట్ లుక్ లో ఒక గొర్రె ముక్కుకి ముక్కుపుడక పెట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉండగా ముఖమంతా రక్తం చింది గాయపడినట్లుగా కనిపిస్తోంది. ఈ సినిమాని లైట్ బుద్ధ ఫిలిమ్స్, అగస్త్య ఫిలిమ్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. సంయుక్త హర్నాడ్, చైత్ర ఆచార్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా గరుడ గమన వృషభవాహన సినిమాకి పనిచేస్తున్న వారందరి నేతృత్వంలో తెరకెక్కినట్లు తెలుస్తోంది. మరోపక్క రాజ్ బి శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన మూడవ సినిమా షూటింగ్ పూర్తయినా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.