రష్మిక హీరోయిన్‌గా రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి మరో కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమాకి మొదటి నుంచీ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. టెక్నికల్‌గా సినిమా బాగానే ఉన్నా, ఎంచుకున్న లైన్ బాలేదని చాలామంది విమర్శించారు. కేవలం అబ్బాయిలను విలన్లుగా చిత్రీకరించి ఇలా సినిమా ఉందని చాలామంది యూత్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే ఈ మధ్యకాలంలో ‘గీతా ఆర్ట్స్’ ఒక వీడియో షేర్ చేసింది. అందులో రాహుల్ రవీంద్రన్ థియేటర్ విజిట్‌కు వెళ్ళినప్పుడు, ఒక అమ్మాయి, “ఇప్పటివరకు నేను చున్నీతో ఉన్నాను, ఈ చున్నీ తీసేసి జీవితంలో ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను” అంటూ పేర్కొన్న వీడియో బాగా వైరల్ అయింది.
Also Read:Globe Trotter: సుమతో కలిసి ఈవెంట్ హోస్ట్ చేసేది ఎవరంటే?
ఆ వీడియోలో మాట్లాడుతూ ఉండగానే ఆమె రాహుల్ రవీంద్రన్‌ను హగ్ చేసుకున్నట్టు కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ సినిమా అంటే పడని వాళ్ళు, ఇటీవల చిన్మయి విషయంలో టార్గెట్ అయినవాళ్ళు చాలామంది రాహుల్ రవీంద్రన్ మీద ఇప్పుడు దాడి చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో రాహుల్ రవీంద్రన్ గురించి చెబుతూ చిన్మయి ఒక విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అదేమంటే, తన కూతురిని హగ్ చేసుకోవాలన్నా కూడా రాహుల్ రవీంద్రన్ ఆమె అనుమతి తీసుకున్న తర్వాత, ఆమె సరే అంటేనే హగ్ చేసుకుంటాడని, అదీ తన భర్త విలువలు అంటూ ఆమె పేర్కొంది. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, “మరి ఈ అమ్మాయికి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఎందుకు హగ్ చేసుకున్నాడు?” అనే విషయాన్ని కామెంట్లలో ప్రశ్నిస్తున్నారు చాలామంది. మరి ఈ విషయం మీద రాహుల్ రవీంద్రన్ లేదా చిన్మయి ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.
