NTV Telugu Site icon

Raghavendra Rao: అది అట్టా పెట్టండి బుద్ధి.. తమ్మారెడ్డికి

Rgk

Rgk

Raghavendra Rao: ఆర్ఆర్ఆర్ సినిమాపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వరకు వెళ్లడం ఎంతో గొప్ప విషయం. ఒక తెలుగువాడిగా గర్వించాల్సింది పోయి ఆయన ఈ సినిమాపై అంచేత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్రబృందం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ డబ్బుతో మేము 8 సినిమాలు తీసి ముఖాన కొడతాం. కేవలం వారు ఫ్లైట్ టికెట్స్ కోసమే అన్ని కోట్లు ఖర్చుపెడుతున్నారు అంటూ తమ్మారెడ్డి ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం సంచలనం సృష్టిస్తోంది. ఇక కొద్దిసేపటి క్రితమే ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు తమ్మారెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెల్సిందే. నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ కోసం అంటూ కొద్దిగా ఘాటుగానే చెప్పుకొచ్చాడు.

Nagababu: నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు.. తమ్మారెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్

ఇక దీంతో ఇండస్ట్రీలోని పెద్దలు సైతం తమ్మారెడ్డి అన్న మాటలను తప్పుపడుతున్నారు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సైతం ట్వీట్ చేస్తూ భారతీయ సినిమా గురించి చెప్పుకొచ్చారు. “మిత్రుడు భరద్వాజ్ కి,తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై మొదటి సారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి.. అంతే కానీ 80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా..? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా ?” అంటూ సున్నితంగానే గట్టి జవాబు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. సరిగ్గా చెప్పారు రాఘవేంద్ర రావు గారు.. అది మన భారతీయ సినిమా.. మనమే ఇలా కించపరుచుకుంటే ఎలా.. అని కొందరు. అది అట్టా పెట్టండి బుద్ధి.. తమ్మారెడ్డికి అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Show comments