Khushi Vs Rudrudu: ‘ఖుషీ’తో వస్తానంటున్న ‘రుద్రుడు’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ నటిస్తున్న తాజా చిత్రం ‘రుద్రుడు’. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటెడ్’ అనేది దాని ట్యాగ్ లైన్. కతిరేశన్ దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్.ఎల్.పి. సంస్థ నిర్మిస్తోంది. దర్శకుడు కతిరేశన్ సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నారు. ఈ యేడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని గతంలో ప్రకటించిన చిత్ర బృందం తాజాగా విడుదల తేదీని ఖరారు చేసింది. డిసెంబర్ 23న ఈ మూవీని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సెకండ్ పోస్టర్ లో లారెన్స్ లుక్ ఇంటరెస్టింగ్ గా వుంది. వైన్ బాటిల్ ని చేతిలో పట్టుకొని సీరియస్ గా చూస్తున్న లుక్ ఆకట్టుకుంటోంది. శరత్ కుమార్, పూర్ణిమా భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
‘ఖుషీ’ సైతం డిసెంబర్ 23నే!
Also Read
- Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
- Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
- Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
- Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో ‘మహానటి’ తర్వాత రూపుదిద్దుకుంటున్న ‘ఖుషీ’ సినిమా సైతం డిసెంబర్ 23నే విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాతలు ఎర్నేని నవీన్, వై. రవిశంకర్ ఈ విషయాన్ని తెలియచేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘ఖుషీ’ మూవీ కూడా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. మరి రెండు డిఫరెంట్ జానర్స్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలను దక్షిణాది ప్రేక్షకులను ఏ రీతిన ఆకట్టుకుంటాయో చూడాలి!!
Bandi Sanjay: కేసీఆర్ ఎవరు? కోన్ కిస్కా.. బండి సంచలన వ్యాఖ్యలు..!
తాజావార్తలు
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్‌తో ఇండియా మార్కెట్‌పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!