Site icon NTV Telugu

అఫిషియల్ : “రాధేశ్యామ్” టీజర్ ముహూర్తం ఖరారు

RadheShyam teaser out on 23rd October

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే పాన్-ఇండియా రొమాంటిక్ డ్రామా “రాధే శ్యామ్”. ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ఈ సినిమా టీజర్ అక్టోబర్ 23 న తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. “విక్రమాదిత్య ఎవరు? అక్టోబర్ 23 న ‘రాధేశ్యామ్’ టీజర్ లో తెలుసుకోవడానికి వేచి ఉండండి! టీజర్‌ను ఇంగ్లీష్ తో పాటు బహు భాషల్లో ఉపశీర్షికలతో ఆస్వాదించండి” అని ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రభాస్ తన పోస్ట్‌లో #GlobalPrabhasDay అనే వైరల్ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.

Read Also : నవ్వుల రేడు… రాజబాబు!

ఈ చిత్రం 2022 జనవరి 14న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదల కానున్న అన్ని సినిమాలు దూకుడుగా సినిమా ప్రమోషన్లు చేస్తుంటే ‘రాధేశ్యామ్’ టీం మాత్రం సైలెంట్ గా ఉంది. కానీ తాజాగా విడుదల చేసిన అప్డేట్ తో రెబల్ స్టార్ అభిమానులు సంతోషంగా ఉన్నారు. విక్రమాదిత్య ఎవరు అనే విషయాన్నీ ప్రపంచానికి పరిచయం చేయడానికి ‘రాధే శ్యామ్’ టీజర్ సిద్ధంగా ఉంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ‘రాధే శ్యామ్’ ఇటలీ నేపథ్యంలో రూపొందింది. గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్, టి-సిరీస్ బ్యానర్‌ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.

Exit mobile version