Site icon NTV Telugu

గెట్ రెడీ ఫర్ “రాధేశ్యామ్” ఫస్ట్ సాంగ్

Radheshyam

Radheshyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని తెగ బాధ పడుతున్న ఆయన అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్ తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్” నుంచి ఎట్టకేలకు ఫ్యాన్స్ ఆకలి తీర్చే అప్డేట్ రాబోతోంది. ‘సాహో’ తరువాత ప్రభాస్ నెక్స్ట్ మూవీ గురించి యంగ్ రెబల్ స్టార్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ‘రాధేశ్యామ్’ నుంచి మేకర్స్ నత్తనడకన అప్డేట్స్ ఇవ్వడం వారికి ఏమాత్రం నచ్చడం లేదు. దీంతో నిర్మాణ సంస్థపై, అలాగే మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘బ్యాన్ యూవీ క్రియేషన్స్’ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓ ప్రభాస్ ఫ్యాన్ ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవద్దు అంటూ చిత్ర నిర్మాతలకు షాక్ ఇచ్చే లెటర్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Read Also : ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్… యూవీ క్రియేషన్స్ కు కొత్త తలనొప్పి

ఈ నేపథ్యంలో తాజాగా ‘రాధేశ్యామ్’ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. నవంబర్ 15న ‘రాధేశ్యామ్’ ఫస్ట్ సింగిల్ వస్తుందని, ప్రభాస్ అభిమానులు రెడీగా ఉండాలంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది అంటున్నారు. కానీ దీనిపై మేకర్స్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఫస్ట్ సాంగ్ లోడింగ్ అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

Exit mobile version