Site icon NTV Telugu

తగ్గేదే లే… రికార్డ్స్ బద్దలు కొడుతున్న “రాధేశ్యామ్”

Radheshyam

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ 23న ఉదయం 11 గంటల సమయంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘రాధే శ్యామ్’ టీజర్ అభిమానులందరినీ ఉర్రూతలూగించింది. అద్భుతమైన విజువల్స్, విక్రమాదిత్య పాత్ర మిస్టరీ, ఆసక్తికరమైన హీరో పాత్ర పరిచయం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం “రాధేశ్యామ్” టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ టీజర్ విడుదలై 24 గంటలు గడిచినప్పటికీ జోరు ఏమాత్రం తగ్గలేదు. గతంలో ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొడుతూ దూసుకెళ్తోంది.

Read Also : “ప్రాజెక్ట్ కే”లో ప్రభాస్ రోల్… హింట్ ఇచ్చిన చిత్రబృందం

తాజాగా “రాధేశ్యామ్” 50 మిలియన్ల వ్యూస్ ను దాటేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ ఫీట్ సాధించడానికి ‘రాధేశ్యామ్’కు 25 గంటల 35 నిముషాలు పట్టింది. ఈ రికార్డును సాధించడానికి “అఖండ”కు 16 రోజులు పట్టగా, అల్లు అర్జున్ “పుష్ప”కు 20 రోజులు పట్టింది. మరోవైపు 24 గంటల్లో మోస్ట్ వ్యూస్ పొందిన చిత్రంగా టాలీవుడ్ లోనే టాప్ ప్లేస్ లో చేరిపోయింది “రాధేశ్యామ్” టీజర్. “రాధేశ్యామ్” రాకముందు ఒక లెక్కా… వచ్చాక ఒక లెక్క… అన్నట్టుగా అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసుకుంటూ టాలీవుడ్ చరిత్రలో సరికొత్త హిస్టరీని క్రియేట్ చేస్తున్నాడు ప్రభాస్. విడుదలైన 20 గంటల్లోనే ‘రాధే శ్యామ్’ తెలుగు టీజర్ యూట్యూబ్‌లో 35 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని సాధించింది. అర మిలియన్‌కు పైగా లైక్స్‌ వచ్చాయి.

Exit mobile version