Radha Madhavam : ఆసక్తికరంగా విలేజ్ లవ్ స్టోరీ ‘రాధా మాధవం’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Radha Madhavam Trailer: విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీల్లోని సహజత్వాన్ని ఉట్టి పడేలా ‘రాధా మాధవం’ అనే సినిమాను తెరకెక్కించారు దాసరి ఇస్సాకు. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన ‘రాధా మాధవం’ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు అందించగా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చూస్తే అందమైన ప్రేమ కథా చిత్రమని తెలుస్తోందని, ట్రైలర్ చాలా బాగుందని అన్నారు. ఇక ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని పేర్కొన్న హీరో, దర్శక నిర్మాతలకు మంచి గుర్తింపు తీసుకు రావాలని కోరారు.
ఇక ఈ సినిమా నిర్మాత గోనాల్ వెంకటేష్ మాట్లాడుతూ ‘మా సినిమా ట్రైలర్‌ను శ్రీకాంత్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని, ఫిబ్రవరిలో మా సినిమా రాబోతోందని అన్నారు. ఆడియన్స్ మా సినిమాను చూసి సక్సెస్ చేయాలని అన్నారు. ఇక హీరో వినాయక్ దేశాయ్ మాట్లాడుతూ ‘మా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసిన శ్రీకాంత్ కి థాంక్స్’ అని అన్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్లతో చిత్రయూనిట్ ప్రేక్షకుల ముందుకు రానుందని అన్నారు. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల తదితరులు పేర్కొన్నారు.
Also Read
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
- Jason Sanjay: "ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే" డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
- TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!