Site icon NTV Telugu

Raashi Khanna: దాని కోసం ఎదురుచూస్తున్న.. హీరోయిన్ కీలక వ్యాఖ్యలు..

Rashi

Rashi

Raashi Khanna In A Recent Interview: సినీ పరిశ్రమలో దశాబ్దం పూర్తి చేసుకున్న హీరోయిన్ రాశి ఖన్నా. 2014లో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన “ఊహలు గుసగుసలాడే” అనే తెలుగు సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సినిమా రాశికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత వరుస ఆఫర్లతో కెరీర్ లో దోసుకుపోతూ తక్కువ టైంలోనే స్టార్స్ అందరితో కలిసి పని చేసింది. గత నెలలో సుందర్ సి దర్శకత్వం వహించిన నటి తమన్నా భాటియాతో కలిసి ఆమె చివరిగా హారర్ చిత్రం ‘అరణ్మనై 4’లో కనిపించింది. ప్రస్తుతం తమిళంలో ‘ది సబర్మతి రిపోర్ట్’ మరియు ‘తలాఖోన్ మే ఏక్’ వంటి పెద్ద చిత్రాలు నటిస్తుంది. తెలుగులో ‘తెలుసు కదా’ అనే సినిమా కూడా చేస్తుంది. రేసెంటుగా తమిళనాడులో జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన నటిస్తున్న”ది సబర్మతి రిపోర్ట్” గురించి మాట్లాడుతూ

Also Read; Rukmini Vasant: నటిగా కాకపోతే టీచర్‌గా ఎదగాలనుకున్న.. క్రేజీ కన్నడ హీరోయిన్!

తొలిసారిగా నటుడు విక్రాంత్ మాస్సే సరసన నటిస్తునని, డ్రామా థ్రిల్లర్ 2002లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొందిన కథగా తెరకెక్కనుంది అని రాశి చెప్పుకొచ్చింది. అలానే తాను కలిసి నటించాలనుకుంటున్న నటీనటుల గురించి మాట్లాడుతూ, రాశి ఇలా చెప్పింది: “నేను నిజంగా మహేష్ బాబుతో కలిసి పని చేయాలనుకుంటున్నాను. నేను ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను. మేము తెరపై అద్భుతంగా కనిపిస్తామని నేను భావిస్తున్నాను. అలానే “ప్రభాస్‌తో కూడా కలిసి పనిచేయడం తనకు చాలా ఇష్టం అని తెలిపింది”. అతను గొప్ప పని చేస్తున్నాడు. నేను “కల్కి 2898 AD” ట్రైలర్‌ని చూసాను నాకు చాలా నచ్చింది. ఆ మూవీ ఎప్పుడు ఎప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవుతుందా అని దాని కోసం ఎదురు చూస్తున్నాను” అని చెప్పుకొచ్చింది.

Exit mobile version