ఏపీ సీఎం జగన్ తో సినీ ఇండస్ట్రీ సమస్యలపై చర్చల ముగించింది చిరంజీవి బృందం. ఆ తరువాత చిరు టీం ప్రెస్ మీట్ లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి మీడియా మీట్ లో సీఎంతో సమావేశంలో పాల్గొన్న సినీ ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన పీపుల్స్ స్టార్ మెగాస్టార్ కు సరదాగా పంచ్ వేశారు. ఆర్ నారాయణ మూర్తి ఈరోజు ఇండస్ట్రీలో చిన్న సినిమాల పరిస్థితి గురించి మాట్లాడారు. తరువాత అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చిరంజీవిని పిలవగా, ఆయన వినయంగా చెప్పండి సార్ అంటూ ముందుకు వచ్చారు. దీంతో నారాయణ మూర్తి ‘అంతొద్దు సార్’ అంటూ చిరుపై పంచ్ వేయగా అక్కడ సరదా సన్నివేశం నెలకొంది. ఈ పాజిటివ్ వైబ్స్ చూస్తుంటే ఇండస్ట్రీ సమస్యలన్నీ తీరినట్టే అన్పిస్తోంది.
Read Also : Chiranjeevi : ఈ నెల మూడవ వారం లోపల జీవో…