NTV Telugu Site icon

Adipurush: తెలుగు బుకింగ్స్ ఓపెనే అవ్వలేదు.. కానీ లక్ష టికెట్లు అమ్ముడయ్యాయ్?

Adipurush Promotions

Adipurush Promotions

PVR and INOX Sold One Lakh Tickets for Adipurush: రాఘవుడు రామ్ గా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్ ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఈ సినిమాలో రావణాసురుడు పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్ ను తీసుకున్నారు. తానాజీ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా టీ సిరీస్ సంస్థతో కలిసి సహ నిర్మించాడు కూడా. ఇక ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రిలీజ్ చేస్తుంది.

Also Read: Adipurush: థియేటర్లో ఆదిపురుష్ సినిమా చూసేప్పుడు పాటించాల్సిన నియమాలివేనట.. వైరల్ అవుతున్న వాట్సాప్ మెసేజ్!

ఈ క్రమంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత తాజాగా తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో T సిరీస్ ఆదిపురుష్ సినిమాను పాన్-ఇండియా స్థాయిలో నిర్మిస్తోందని ప్రతి భాషకు, సినిమాని కొని తమ ప్రాంతంలో విడుదల చేసే వేరే నిర్మాత ఉంటారని అన్నారు. అదే పద్ధతిలో తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ హక్కులను కొనుగోలు చేశానని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఆదిపురుష్ ఓపెనింగ్స్ మొదలయ్యాయి కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఆలస్యం జరిగింది? అని అడిగితే టిక్కెట్ ధరల కారణంగా, తెలుగులో ఓపెనింగ్స్ ఆలస్యం అయ్యాయని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం ఓపెనింగ్స్ ప్రారంభం కానున్నాయని ఆయన వెల్లడించారు.

Also Read: Raviteja remuneration: హిట్లతో పనేంటి.. ‘తగ్గేదే’ లేదంటూ మళ్లీ పెంచేసిన రవితేజ!

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో సింగిల్ స్క్రీన్‌ల కోసం మరో రూ.50 టిక్కెట్‌ను పెంచడానికి మాకు అనుమతి లభించిందని, మేము’ రూ. 50తో వెళ్ళాలా లేదా రూ. 25 పెంపుతో వెళ్లాలా అని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. అందుకు ప్రభుత్వ జీవో కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోయినా ఐనాక్స్ థియేటర్ల చైన్ ఈ సినిమాకు సంబంధించి లక్ష టికెట్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఒకరకంగా ఇది ఆదిపురుష్ క్రేజ్ ను బయట పెడుతోంది.

Show comments