‘పుష్పక విమానం’ వచ్చేస్తోంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ‘దొరసాని’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్. తొలి చిత్రంతోనే నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో తనలోని కామెడీ టైమింగ్ ను తెలియచేశాడు. ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవడం విశేషం.
ఇక ఆనంద్ దేవరకొండ హీరోగా రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘పుష్పక విమానం’ ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు దాని విడుదలను ప్రొడ్యూసర్స్ వాయిదా వేస్తూ వచ్చారు. మొత్తానికి ఈ ‘పుష్పక విమానం’ ఆగమనాన్ని అడ్డుగా ఉన్న మేఘాలన్నీ తొలగిపోయాయి. ఈ కాన్సెప్ట్ బేస్డ్ మూవీని నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. దామోదర ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘పుష్పక విమానం’మూవీని గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి ,ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మించారు.
Also Read
- Epic: ‘కడలి’ ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది.. ఫ్యామిలీ ఆడియన్స్ ని 'ఎపిక్' మెప్పిస్తుంది : వైష్ణవి చైతన్య
- Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. 'అమ్ములు' ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
- Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
- Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
ఈ మూవీ గురించి దర్శకుడు మాట్లాడుతూ, ”ఇందులో ఆనంద్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా నటిస్తున్నాడు. ఈ కథ మధ్యతరగతి కుటుంబాలలో వుండే డ్రామాని గుర్తుచేస్తూ , పెళ్లి చుట్టూ వుండే పరిస్థితులని చూపెడుతుంది. సునీల్, నరేష్, హర్షవర్థన్, గిరిధర్, కిరీటి, భద్రం, వైవా హర్ష, అభిజిత్, అజయ్, సుదర్శన్, శరణ్య ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. శాన్వి మేఘన, గీత్ సాయిని హీరోయిన్స్ గా నటించారు” అని అన్నారు. రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు విజయ్ దేవరకొండ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.
తాజావార్తలు
-
Epic: ‘కడలి’ ప్రతి అమ్మాయిలోనూ ఉంటుంది.. ఫ్యామిలీ ఆడియన్స్ ని ‘ఎపిక్’ మెప్పిస్తుంది : వైష్ణవి చైతన్య
-
Anaswara Rajan: చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్.. ‘అమ్ములు’ ఫస్ట్‌లుక్ వచ్చేసింది!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!