NTV Telugu Site icon

Pushpa2 The Rule Teaser: పుష్ప గాడి కాళ్లకు గజ్జెలు కట్టి.. అద్దీ.. అట్టా హైప్ పెంచు మావ!

Allu Arjun Pushpa 2

Allu Arjun Pushpa 2

Pushpa2 The Rule Teaser Date Announced: అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం పుష్ప ది రూల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో అప్పట్లోనే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇక ప్రస్తుతానికి ఈ సీక్వెల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సినిమా యూనిట్స్ సిద్ధమవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఆగస్టు 15వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఒక సరికొత్త పోస్టల్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

NBK 109: బాలయ్య-బాబీ సినిమా టైటిల్ ఇదే?

అసలు విషయం ఏమిటంటే ఈ నెల 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆ రోజు ఒక టీజర్ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని ఒక పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించింది సినిమా యూనిట్. తాజాగా సినిమా యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ అల్లు అర్జున్ కాళ్లను మాత్రమే చూపిస్తూ పోస్టర్ డిజైన్ చేశారు అల్లు అర్జున్ గతంలో లేడీ గెటప్ లో ఉన్న ఒక పోస్టర్ వైరల్ అయింది. తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర నేపథ్యంలో ఒక ఎపిసోడ్ షూట్ చేస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ తాజా పోస్టర్ చూస్తే కూడా అదే నేపథ్యంలోనే పోస్టర్ అని క్లారిటీగా అర్థమయిపోతుంది. కింద అంతా కుంకుమ పరిచినట్లు కనిపిస్తూ ఉండగా డాన్స్ చేస్తున్నట్లుగా కాళ్లకు గజ్జలు కట్టుకొని అనిపిస్తోంది. మొత్తం మీద ఈ టీజర్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది.