Site icon NTV Telugu

తగ్గేదేలే.. ‘కెజిఎఫ్’ రికార్డులను బద్దలుకొట్టిన ‘పుష్ప’

pushpa

pushpa

పుష్ప.. పుష్ప.. పుష్ప.. ప్రస్తుతం ఎక్కడ విన్నా పుష్ప రికార్డులే మారుమ్రోగిపోతున్నాయి. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకోంది. కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసి అల్లు అర్జున్ కెరీర్లోనే బెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయినా ఈ సినిమా 13 రోజుల్లో  45.5 కోట్ల రూపాయల తో బాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇంకా చెప్పాలంటే ‘కెజిఎఫ్’ ఆల్ టైమ్ రికార్డులను ‘పుష్ప’ బద్దలుకొట్టిందనే చెప్పాలి. హిందీలో ‘కెజిఎఫ్’ లైఫ్ టైం లో సాధించిన వసూళ్ళను ‘పుష్ప’ 13 రోజుల్లోనే రాబట్టింది. మొదటి రెండు వారాల్లో కంటే మూడో వారంలో 1600 స్క్రీన్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టిస్తోంది. మరి ముందు ముందు ‘పుష్ప’ రాజ్ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి

Exit mobile version