Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ తరపు న్యాయవాది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 డిసెంబర్ 4వ తేదీన ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్దకు భారీగా అభిమానులు, ప్రేక్షకులు తరలివచ్చారు. ఆ సమయంలో తీవ్రమైన తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దురదృష్టకర ఘటనలో రేవతి అనే మహిళ ఊపిరాడక మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు సమగ్ర విచారణ జరిపారు. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో కీలక చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇందులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. భద్రతా లోపాలు, నిర్లక్ష్యానికి కారణమైన సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని పోలీసులు ప్రధాన నిందితులుగా పేర్కొంటూ, వారిని ఏ1 (A1) నుంచి ఏ10 (A10) వరకు చేర్చారు. ఇక ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను ఏ11 (A11) నిందితుడిగా పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
ఈ కేసు నేడు నాంపల్లి కోర్టు పోలీసులు సమర్పించిన చార్జ్‌షీట్‌ను పరిశీలించిన నాంపల్లి కోర్టు.. ప్రాథమిక ఆధారాలను బట్టి మొత్తం 19 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా హీరో అల్లు అర్జున్ను స్వయంగా ఈరోజు కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం పేర్కొంది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ముంబైలో అట్లీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న కారణంగా బదులుగా ఈరోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఆన్లైన్లో హాజరయ్యేందుకు కోర్టు అనుమతి కోరగా అందుకు న్యాయస్థానం అనుమతి నిరాకరించింది. నేడు షూటింగ్ కారణంగా బన్నీ లాయర్ కోర్టుకు హాజరై, తదుపరి లీగల్ ప్రొసీడింగ్స్ చూసుకోనున్నారు. మరి ఈ రోజు కోర్టులో జరుగనున్న విచారణ అనంతరం న్యాయస్థానం ఎలాంటి తీర్పునిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.
Also Read
- KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
- Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!