బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా మే 22న రిలీజ్ కాబోతుందని ప్రకటిస్తూ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో..
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. ‘‘పురుష:’ కోసం సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను ఇలా ఈ స్టేజ్ మీద నిల్చున్నానంటే దానికి మా నాన్న గారే కారణం. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చిన వీరు అన్నకి థాంక్స్. నాకు యాక్టింగ్‌లో సపోర్ట్ చేసిన సప్తగిరి అన్నకి, కసిరెడ్డి అన్నకి థాంక్స్. సక్సెస్ ఫుల్‌గా ఈ మూవీని పూర్తి చేశాం. మా అందరినీ బాగా చూపించిన సతీష్ గారికి థాంక్స్. మా చిత్రం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సమ్మర్‌లో ‘పురుష:’ మే 22న రాబోతోంది. నిర్మాతగా మా నాన్న గారు అనుకున్న స్థాయిలోనే సినిమాని తీశామని, నేను నటించానని అనుకుంటున్నాను. అందరూ మా సినిమాని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
