పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న రామ్ ఆ తర్వాత ‘రెడ్’ మూవీ చేశాడు. ఇప్పుడు లింగు స్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ నెల 14న విడుదల కాబోతున్న ‘ది వారియర్’తో రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. పూరి, లింగుస్వామి గురించి రామ్ చెబుతూ, ”వీరిద్దరూ ట్రెండ్ సెట్టర్స్. వేరే కథలు డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఆ కథలు కనెక్ట్ కావడం లేదు గానీ… వాళ్ళ బ్రిలియన్స్ కనబడుతోంది. ఇద్దరం కనెక్ట్ అయ్యి కరెక్ట్ స్క్రిప్ట్ పడితే రిజల్ట్ బావుంటుంది. వీళ్ళందరూ డైమండ్స్ లాంటి వాళ్ళు. లోస్ వచ్చినప్పుడు కొంచెం దుమ్ము పడుతుంది. తుడిస్తే మళ్లీ డైమండ్ కనబడుతుంది” అని అన్నారు.
లింగు స్వామి కథ చెప్పే సమయానికి తాను పోలీస్ స్టోరీస్ చేయకూడదనే నిర్ణయానికి వచ్చానని, కానీ ఒకసారి వింటే పోలా అనే ఉద్దేశ్యంతోనే స్టోరీ విన్నానని రామ్ చెప్పారు. ఆ నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ, ”నిజానికి ఫార్మాలిటీ కోసం వినేసి ఆ తర్వాత వద్దని చెబుదామనుకుని వినడం మొదలుపెట్టా. కథంతా విన్న తర్వాత ఇటువంటి కథే చేయాలని డిసైడ్ అయ్యా. బయట నుంచి చూసినప్పుడు ఏ కథైనా ఒకేలా ఉంటుంది. అదే పోలీస్, అదే విలన్! కానీ, ఒక సోల్ ఉంటుంది. పోలీస్ ఎందుకు అయ్యాడు? అయిన తర్వాత ఏం చేస్తున్నాడు? అనే దానిపై సినిమాకి మెయిన్ అవుతుంది. ‘ది వారియర్’లో ఆ సోల్, ఎమోషన్ నాకు బాగా నచ్చింది. ‘మీరు ఎలా రాశారు? ఈ ఆలోచన ఎలా వచ్చింది?’ అని అడిగితే… ‘కొంత మంది రియల్ పోలీస్ ఆఫీసర్లను చూసి కథ రాశా’ అని చెప్పారు. నిజంగా కొందరు పోలీసులు అలా ఉన్నారు. ఆ విషయం చాలా మందికి తెలియదు. కథ చెప్పేటప్పుడు అందులో జెన్యూన్ ఎమోషన్ నాకు కనిపించింది. ఈ కథ నన్ను ఎంత ఎగ్జైట్ చేసిందంటే… లింగుస్వామి గారు నేరేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ సాయంత్రానికి పోలీస్ యూనిఫామ్ మా ఇంటికి తెప్పించాను” అని అన్నారు. తాను తమిళ డబ్బింగ్ ను కూడా చాలా ఫాస్ట్ గా చెప్పానని రామ్ అన్నారు. తాను చెన్నయ్ పెరగడం వల్ల తమిళం బాగా వచ్చని అందువల్లే డబ్బింగ్ ఈజీ అయ్యిందని, ఒక్క కరెక్షన్ కూడా లేకుండా డబ్బింగ్ చెప్పేశాన’ని అన్నారు.
‘ది వారియర్ మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ చాలా కేర్ తీసుకున్నారని రామ్ చెప్పారు. ”దేవితో నాకు ఇది ఏడో సినిమా. లింగుస్వామి గారు స్క్రిప్ట్ చెప్పి వెళ్లిన తర్వాత నాకు ఫోన్ చేసి… రీ రికార్డింగ్ గురించి, సీక్వెన్సుల గురించి మాట్లాడాడు. అంత ఎగ్జైట్ అయ్యాడు. ఇలా అంతకు ముందు ఎప్పుడు చెప్పలేదు. కార్ స్పీకర్లో సాంగ్స్ వినడం వేరు. ఇంట్లో వినడం వేరు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినడం వేరు. థియేటర్లో వేరు. ఒక్కో స్పీకర్లో సాంగ్ ఎలా రావాలి? అని ఆలోచించి డిజైన్ చేశాడు. సాంగ్స్ మాత్రమే కాదు… కంప్లీట్ సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం డిజైన్ చేశాం. ఎమోషన్స్, సాంగ్స్, పెర్ఫార్మన్స్… కమర్షియల్ ప్యాకేజ్డ్ మూవీ ఇది. అలానే ‘బుల్లెట్…’ పాటకు శింబు అయితే బావుంటుందని చెప్పగానే నాకు అతను గతంలో పాడిన ఓ పాట గుర్తు వచ్చింది. ఓకే అనేశాను. బుల్లెట్ పాటకు తెలుగులో 80 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. తమిళంలో 70 మిలియన్ ప్లస్ వచ్చాయి. తమిళంలో అంత రీచ్ రావడానికి శింబు ఒక కారణం” అని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మోకాలికి గాయమైన షూటింగ్ చేశానని, సెట్ పైకి వెళ్ళినప్పుడు కెమెరా చూస్తే… అభిమానులే తన కళ్లకు కనిపించారని, వారందరని ఆదరణతో ఈ మూవీ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని రామ్ ఆశాభావం వ్యక్తం చేశారు