Puri Jagannadh: పూరీ నెక్ట్స్ ప్రాజెక్ట్.. అతనితో మాత్రం కాదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Puri Jagannagh Next Project Is Not With That Hero: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకప్పుడు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్ని అందించాడు. ‘పోకిరి’లాంటి ట్రెండ్‌సెట్టింగ్ సినిమాతో.. ఇండస్ట్రీ రూపురేఖల్నే మార్చేశాడు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ‘లైగర్’ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ, అది కూడా ఘోరంగా బెడిసికొట్టింది. నిజానికి.. ఓ సినిమా తీసేందుకు పూరీ ఆరు నెలల కంటే ఎక్కువ సమయం తీసుకోడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంటాడు. కానీ, లైగర్ కోసం దాదాపు మూడేళ్లు కష్టపడ్డాడు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలన్న ఉద్దేశంతో, ‘లైగర్’ మీదే దృష్టి సారించాడు. కానీ, అతని కష్టమంతా బూడిదపాలైంది. ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. పూరీకి విమర్శలే మిగిలాయి.
అయినప్పటికీ పూరీ జగన్నాథ్ నిరాశ చెందకుండా.. అప్పుడే తన తదుపరి ప్రాజెక్ట్‌పై పని చేయడం మొదలుపెట్టేశాడు. ‘లైగర్’ డిజాస్టర్ అవ్వడంతో.. విజయ్ దేవరకొండతోనే చేయాలనుకున్న ‘జన గణ మన’ సినిమా ఆగిపోయింది కాబట్టి, మరో కొత్త స్టోరీని డెవలప్ చేయడంలో బిజీ అయిపోయాడు. స్క్రిప్ట్ సిద్ధం చేయడం కోసం ఆల్రెడీ పూరీ గోవాకు వెళ్లాడు. ఈ క్రమంలోనే.. పూరీ తన తదుపరి సినిమా కొడుకు ఆకాశ్ పూరీతో చేయనున్నాడని టాక్ వినిపించింది. ఫ్లాపుల్లో ఉన్న పూరీ ఏ ఇతర హీరోలు డేట్స్ ఇవ్వడం లేదని, అందుకే తన కొడుకుతో సినిమా చేయాలని పూరీ నిర్ణయించుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే.. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తాజా సమాచారం. పూరీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఆకాశ్‌తో చేయడం లేదని సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. పూరీ తన ప్రాజెక్ట్ కూడా గ్రాండ్‌గానే ప్లాన్ చేస్తున్నాడని, అయితే హీరో ఎవరన్నది ఇంకా కన్ఫమ్ అవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన స్క్రిప్ట్ పనుల్లోనే పూర్తిగా నిమగ్నమయ్యాడని, అది పూర్తయ్యాకే హీరో గురించి ఆలోచించే అవకాశం ఉందని తెలిసింది. తన స్ర్కిప్టులపై విమర్శలు వస్తోన్న తరుణంలో.. వాటికి చెక్ పెట్టేలా ఒక మంచి స్క్రిప్ట్‌ని సిద్ధం చేసే పనిలో పూరీ ఉన్నాడని చెప్తున్నారు. మరి, ఈసారి పూరీ ఎలాంటి స్క్రిప్టుతో, ఏ హీరోతో రానున్నాడో చూడాలి.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!