Puri-Sethupathi : డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. అయితే విజయ్ తో చేస్తున్న కథ చిరంజీవితో చేయాల్సిందంటూ ప్రచారం జరిగింది. దానిపై ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్ స్పందించలేదు. తాజాగా విజయ్ సేతుపతి ఈ విషయంపై మాట్లాడారు. విజయ్-నిత్యామీనన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సార్-మేడమ్’ ప్రస్తుతం తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఇందులో పూరీతో చేస్తున్న మూవీ కథపై ప్రశ్న రావడంతో ఆయన స్పందించారు. ఈ విషయం ఇప్పుడే చెప్పలేం అన్నారు.
Read Also : Rajasaab : రాజాసాబ్ సెట్స్ లో పూరీ.. ప్రభాస్ లుక్స్ చూశారా
కథ గురించి నేనెలా చెప్పగలుగుతా. మూవీ ఔట్ పుట్ చూడండి మీకే తెలుస్తుంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ గారితో పనిచేస్తున్న ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తున్నాను. మూవీ కథ మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ సేతుపతి. ఆయన మాటలను బట్టి చూస్తుంటే ఏ చిన్న క్లూ ఇవ్వడానికి కూడా ఆయన ఇష్టపడట్లేదు. మూవీపై క్యూరియాసిటీని తగ్గించొద్దని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సార్ మేడమ్ తమిళ్ లో పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. తెలుగులో ఆలస్యంగా రిలీజ్ అవుతోంది.
Read Also : Coolie : కూలీ నుంచి పవర్ ఫుల్ సాంగ్ రిలీజ్
